మలయాళి ముద్దుగుమ్మ పూర్ణ ప్రస్తుతం తెలుగు ప్రేక్షకులకు బుల్లి తెర మరియు వెండి తెరపై రెగ్యులర్ గా కనిపిస్తూనే ఉంది. బుల్లి తెరపై అతి పెద్ద డాన్స్ షో అయిన ఢీ లో సందడి చేస్తోంది. జడ్జ్ గా సుదీర్ఘ కాలంగా పూర్ణ కొనసాగుతున్న విషయం తెల్సిందే. పూర్ణ మరో వైపు నటిగా కూడా బిజీగా ఉంది. వరుసగా చిన్న సినిమాలు పెద్ద సినిమాలు అనే తేడా లేకుండా మంచి పాత్రలు వస్తే చేసేందుకు సిద్దంగా ఉంటున్న పూర్ణ మరో రెండు రోజుల్లో విడుదల కాబోతున్న అఖండ సినిమాలో కూడా నటించింది. బాలకృష్ణ.. బోయపాటి ల కాంబోలో తెరకెక్కిన అఖండ సినిమాలో మెయిన్ హీరోయిన్ గా ప్రగ్యా జైస్వాల్ నటించింది. కనుక పూర్ణ కీలక పాత్రలో కనిపించబోతున్నట్లుగా తెలుస్తోంది. సినిమాలో తన పాత్రకు చాలా ప్రాముఖ్యత ఉంటుందని పూర్ణ పలు సందర్బాల్లో చెప్పుకొచ్చింది. కనుక పూర్ణ కు అఖండ సినిమా మరోసారి మంచి టర్నింగ్ పాయింట్ గా నిలుస్తుందేమో చూడాలి.
పూర్ణ హీరోయిన్ గా టాలీవుడ్ లో అడుగు పెట్టి 12 ఏళ్లు అయ్యింది. ఇంకా కూడా టాలీవుడ్ లో నటిగా కొనసాగుతుంది అంటే ఆమె కెరీర్ లో ఎంపిక చేసుకుంటున్న పాత్రలు మరియు చేస్తున్న సినిమాలు అనడంలో సందేహం లేదు. కెరీర్ ఆరంభంలో జాగ్రత్తగా ఉండి మంచి సినిమాలు ఎంపిక చేసుకుని చేస్తేనే భవిష్యత్తు బాగుంటుంది. పూర్ణ అదే చేసింది. తాజాగా అఖండ సినిమా ప్రమోషనల్ ఇంటర్వ్యూలో భాగంగా పూర్ణ తన కెరీర్ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. ఇండస్ట్రీలో ఎక్కువ కాలం ఉండాలంటే మంచి సినిమాలు చేయాలి.. డబ్బు కావాలంటే ఏ సినిమాలైన చేయవచ్చు.. ఎక్కువ కాలం కొనసాగేలా మాత్రమే నేను సినిమాలను చేశాను. నాకు ఇండస్ట్రీలో మంచి ఆఫర్లు వచ్చాయి.. ముందు ముందు కూడా నేను ప్రాముఖ్యత ఉన్న పాత్రలను మాత్రమే చేస్తానంటూ చెప్పుకొచ్చింది.
కెరీర్ ఆరంభంలో వచ్చిన ప్రతి సినిమాను చేయాలనుకుని తప్పు చేశాను. ఆ సమయంలో అనవసరంగా కొన్ని సినిమాలను చేశాను. కాని ఇప్పుడు మాత్రం సినిమాల ఎంపిక విషయంలో చాలా జగ్రత్తలు తీసుకుంటున్నాను. ప్రతి ఒక్క సినిమా విషయంలో కూడా నేను జాగ్రత్తగా ఉంటున్నట్లుగా చెప్పుకొచ్చింది. అఖండ సినిమా తర్వాత ఈ తరహా పాత్రలు ఖచ్చితంగా మరిన్ని వస్తాయని చెప్పుకొచ్చింది. లేడీ ఓరియంటెడ్ సినిమాలను తాను చేయాలనుకుంటున్నట్లుగా చెప్పిన ఈమె ఒక పరిధిలో మాత్రమే వాటిని చేస్తానంటూ కూడా పేర్కొంది. మంచి కాన్సెప్ట్ మరియు మంచి పాత్ర వస్తే నటించేందుకు తనకు ఏ అభ్యంతరం లేదు అన్నట్లుగా పూర్ణ చెప్పుకొచ్చింది. అఖండ సినిమా తర్వాత మళ్లీ ఈమె బిజీ అయ్యేనా చూడాలి.