కార్తీక్ ఆర్యన్ హీరోగా కియారా అద్వానీ హీరోయిన్ గా టబు ఇంకా పలువురు ప్రముఖులు నటించిన భూల్ భులయా 2 సినిమా మంచి విజయాన్ని సొంతం చేసుకున్న విషయం తెల్సిందే. బాలీవుడ్ తీవ్ర ఒడిదొడుకులు ఎదుర్కొంటున్న సమయంలో వచ్చిన ఈ సినిమా హిట్ టాక్ ను దక్కించుకోవడంతో పాటు భారీ వసూళ్లు నమోదు చేసింది.
గత ఏడాది ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా దాదాపుగా రెండు వందల కోట్ల రూపాయల వసూళ్లు రాబట్టింది. దాంతో ఈ సినిమాను తెలుగులో రీమేక్ చేసేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. దర్శకుడు రమేష్ వర్మ కు ఈ రీమేక్ బాధ్యతలు దక్కినట్లుగా తెలుస్తోంది. గతంలో ఈయన రీమేక్ బాధ్యతలు సక్రమంగా నిర్వర్తించి సక్సెస్ దక్కించుకున్నాడు.
ఈ రీమేక్ కు దర్శకుడు కన్ఫర్మ్ అయ్యాడు కానీ హీరో విషయంలో మాత్రం కన్ఫ్యూజన్ కొనసాగుతోంది. మొన్నటి వరకు అక్కినేని హీరో నాగ చైతన్య పేరు ప్రధానంగా వినిపించింది. అదే సమయంలో నితిన్ పేరును కూడా కొన్ని మీడియా సంస్థలు ప్రచారం చేయడం జరిగింది. ఇటీవల నాగ చైతన్య ఆ రీమేక్ లో నటించడం లేదు అంటూ క్లారిటీ వచ్చింది.
ఇక రీమేక్ కోసం నందమూరి కళ్యాణ్ రామ్ మరియు వరుణ్ తేజ్ ల పేర్లు కూడా ప్రముఖంగా వినిపిస్తున్నాయి. ప్రస్తుతం వరుణ్ తేజ్ ఇతర ప్రాజెక్ట్ లతో బిజీగా ఉన్నాడు.
కళ్యాణ్ రామ్ చేస్తున్న సినిమాలు ముగింపు దశకు చేరుకోవడంతో రీమేక్ లో కళ్యాణ్ రామ్ నటించే అవకాశాలు ఉన్నాయి అంటూ ఇండస్ట్రీ వర్గాల వారు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
తెలుగు ప్రేక్షకులకు కూడా కనెక్ట్ అయ్యే మంచి కమర్షియల్ ఎలిమెంట్స్ ఈ కథ లో ఉంటాయి. కనుక సినిమా తెలుగు లో తప్పకుండా భారీ విజయాన్ని సొంతం చేసుకుంటుంది అని నమ్మకం ను కొందరు వ్యక్తం చేస్తున్నారు. కళ్యాణ్ రామ్ కి ఈ రీమేక్ లో నటించే అవకాశం కలిగితే మాత్రం తప్పకుండా లక్కీ అన్నట్టు కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.