మాధవీ లత షాకింగ్‌ రోల్‌

Update: 2015-06-30 13:36 GMT
అసలు తెలుగు హీరోయిన్ల కోసం పాత్రల్ని క్రియేట్‌ చేయడం తెలుసా? అని ప్రశ్నించింది బిందుమాధవి. ఏ ముహూర్తాన ఈ అమ్మడు ఇలా వాపోయిందో .. ! తెలుగులో తెలుగు డైరెక్టర్లు తెలుగు హీరోయిన్ల కోసం కొత్త పంథా క్యారెక్టర్లు క్రియేట్‌ చేయడానికి రెడీ అవుతున్నారు.

అప్పట్లో నరసింహా నంది అలాంటి సినిమాలు తీసి మెప్పించాడు. 1940 ఒక గ్రామం చిత్రంలో కథానాయకుడి పాత్రకు ఎంత స్కోప్‌ ఉందో కథానాయిక పాత్రకు అంతే స్కోప్‌ కనిపించింది. ఆ తర్వాత కమలతో నా ప్రయాణం చిత్రంలో అర్చనను అంతే గొప్పగా చూపించాడు. కానీ ఫలితం ఆ రెండు సినిమాలకు ప్రశంసలు మాత్రమే వచ్చాయి. నో కలెక్షన్స్‌. అయినాసరే ఇప్పుడు మరో దర్శకుడు చలం రాసిన ఓ నవల ఆధారంగా అలాంటి సినిమాయే ఇంకోటి తీస్తున్నాడు. 1950లలో సాగే ఈ కథలో గజల్‌ శ్రీనివాస్‌, మాధవీలత లీడ్‌ పెయిర్‌గా నటిస్తున్నారు.

మాధవీ లత ఇటీవలే తమిళ్‌ సినిమా అంబాలలో ఓ గ్లామరస్‌ పాత్రలో నటించి మెప్పించింది. ఇప్పుడు ఉన్నట్టుండి పల్లెటూరి పిల్ల గెటప్‌లో నటించడానికి రెడీ అవుతోంది. కాటుక కళ్లు, కుంకుమ బొట్టు, బుట్ట పూల జాకెట్టు, పరికిణీ.. అచ్చ తెలుగు లోగిళ్లలోని ఆడపడుచులా కనిపించబోతోంది మాధవీ. అదీ సంగతి.

Tags:    

Similar News