#DRUGS లో టాలీవుడ్ అగ్ర నిర్మాత‌ ఫ్రెండ్ పేరెలా వ‌చ్చింది?

Update: 2020-09-22 17:30 GMT
బాలీవుడ్ లో తీగ లాగితే మాదకద్రవ్యాల డొంకంతా కదిలిపోతోంది. నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో(ఎన్.సి.బి) బ‌రిలో దిగి సుశాంత్ సింగ్ రాజ్ పుత్ బ‌ల‌వ‌న్మ‌ర‌ణం వెన‌క డ్రగ్స్ కోణంపై దర్యాప్తు చేస్తున్నందున ఎన్నో షాకింగ్ విష‌యాలు వెలుగులోకి వస్తున్నాయి. హిందీ చ‌ల‌న‌చిత్ర ప‌రిశ్ర‌మ‌లో పేరుకుపోయిన డ్ర‌గ్ క‌ల్చ‌ర్ గుట్టు మొత్తం బ‌య‌ట‌ప‌డిపోతోంది. ఏజెన్సీ రెండు రోజులుగా సుశాంత్ సింగ్ టాలెంట్ మేనేజర్ జయ సాహాను విచారిస్తుండ‌గా అనేకమంది సెల‌బ్రిటీల‌ పేర్లు బ‌య‌ట‌ప‌డుతున్నాయ‌ని జాతీయ మీడియాలో క‌థ‌నాలు వేడెక్కిస్తున్నాయి. ఈ కేసులో ఇప్ప‌టికే ప‌లువురు టాలీవుడ్ క‌థానాయిక‌ల పేర్లు వినిపించాయి. కొద్దిసేప‌టి క్రితం సూప‌ర్ స్టార్ మ‌హేష్ భార్య పేరును జాతీయ మీడియాలు హైలైట్ చేయ‌డంపై ఫిలింన‌గ‌ర్ వ‌ర్గాల్లో చ‌ర్చ సాగుతోంది. అయితే ఇదంతా అస‌త్య ప్రచార‌మ‌ని న‌మ్ర‌త టీమ్ ఖండించింది.

ఇక ఇదే జాబితాలో టాలీవుడ్ బాలీవుడ్ తో స‌త్సంబంధాలున్న ప్ర‌ముఖ నిర్మాత మధు మంతెన‌ పేరు ఉంద‌ని జాతీయ మీడియాలో ప్ర‌చారం సాగుతోంది. జ‌య సాహాతో మ‌ధు మంతెన లింకుల‌పై ఆరా తీసేందుకు ఇప్ప‌టికే నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో డ్రగ్స్ నెక్సస్ కేసులో ప్రశ్నించడానికి పిలిపించ‌నుంద‌ని క‌థ‌నాలొచ్చాయి. సెప్టెంబరు 23 న ఆయ‌న‌ ఏజెన్సీ ముందు హాజరుకానున్నట్లు ప్ర‌చారం సాగుతోంది. నిర్మాత మ‌ధు మంతెన టాలీవుడ్ అగ్ర నిర్మాత అల్లు అర‌వింద్ కి స్నేహితుడే గాక క‌లిసి ప‌లు క్రేజీ చిత్రాల్ని నిర్మిస్తున్న సంగ‌తి విధిత‌మే.

జయ సాహా వాట్సాప్ చాట్లలో దీపికా పదుకొనే.. శ్రద్ధా కపూర్.. దియా మీర్జా వంటి అనేకమంది ప్ర‌ముఖుల పేర్లు ఇప్ప‌టికే బ‌య‌ట‌ప‌డ్డాయి. జయ పేరు సిబిడి ఆయిల్... హాష్ అని చాటింగుల్లో ఉంది. ఔషధాల గురించి సాహా సెల‌బ్రిటీల‌తో కోడ్ లాంగ్వేజ్ లో చర్చిస్తున్న అనేక చాట్లు బ‌య‌ట‌ప‌డ్డాయి. మరోవైపు జయ‌ సాహాతో దీపికా పదుకొనే మేనేజర్ కరిష్మా చాట్ కూడా వెలుగులోకి వచ్చింద‌ని.. అందులో డ్రగ్స్ గురించిన‌ చ‌ర్చ సాగింద‌ని ఎన్.సి.బి వ‌ర్గాలు వెల్ల‌డించిన‌ట్టు క‌థ‌నాలొచ్చాయి.

మాదకద్రవ్యాల పెడ్లర్ అనుజ్ కేశ్వానీని ఎన్.‌సిబి ప్రశ్నించినప్పుడు ప్ర‌ముఖ న‌టి దియా మీర్జా పేరు ఈ కేసులో బయటపడింది. దియా మిర్జా మేనేజర్ ఆమె కోసం డ్రగ్స్ సేకరించేవార‌ని అనుజ్ ఏజెన్సీకి చెప్పార‌ని తెలుస్తోంది. మాదకద్రవ్యాల నియంత్రణ బ్యూరో త్వ‌ర‌లోనే దీపిక ప‌దుకొనే.. దియాల‌పై విచారించే వీలుంద‌ని జాతీయ మీడియాలో క‌థ‌నాలు వ‌స్తున్నాయి.
Tags:    

Similar News