భారతీయుడు2 (ఇండియన్-2) సెట్స్ లో క్రేన్ ప్రమాదం గురించి తెలిసిందే. ఈ ప్రమాదంలో ముగ్గురు సహాయకులు మృతి చెందారు. అందులో మధు అనే ప్రొడక్షన్ అసిస్టెంట్ కి సంబంధించి షాకిచ్చే నిజాలు తెలిసాయి. మధు మృతితో ఆ కుటుంబ సభ్యుల్లో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. ప్రస్తుతం ఆ యువకుడి తల్లిదండ్రులు తననే తలుచుకుంటూ కన్నీరుమున్నీరవుతున్నారు. ``సినిమాలంటూ వెళ్లావు.. నీ జీవితం అక్కడే ముగిసి పోయిందా?`` అంటూ ఆవేదనకు గురయ్యారు. అంతేకాదు.. మధు గురించి కొన్ని ఆసక్తికర సంగతు తెలిసాయి.
మధు పూర్తిపేరు మధు సూధనరావు. వయసు 29. చిన్నప్పటి నుంచి సినిమాలంటే పిచ్చి. ఆ ఇష్టంతోనే ఇంట్లో ఇష్టం లేకపోయినా చెన్నై వెళ్లి సినిమాలకు పని చేయడం మొదలు పెట్టాడుట. ఎన్నో కష్టాలు పడి కేటరింగ్ విభాగంలో ప్రొడక్షన్ అసిస్టెంట్ గా పనికి చేరాడు. దీంతో హీరోలను దగ్గర నుంచే చూసే అదృష్టం దక్కిందని ఎంతో సంతోషించే వాడుట. మధు తళా అజిత్ కు వీరాభిమాని. తనకు వ్యక్తిగతం గా క్లోజ్ అయ్యాడట. ఇలా కొన్నేళ్ల పాటు ప్రొడక్షన్ లో పని చేయడం తో మధు హీరోలకు..హీరోయిన్లకు బాగా క్లోజ్ అయ్యాడు. అందరూ మధు అని పేరు పెట్టి పిలిచేంత చనువు సంపాదించాడుట.
రజనీకాంత్...అజిత్...విజయ్..శంకర్ లకు సెట్ లో తరుచూ వడ్డన చేసేది మధునే. అందరి తోనూ మధుకి మంచి సాన్నిహిత్యం ఏర్పడిందిట. వృతి పట్ల ఎంతో అంకిత భావంతో పనిచేసేవాడు కావడం తో అంతా అభినందించేవారట. పనిలో డెడికేషన్ చూసి క్లోజ్ అయిపోయారట. పైకి వస్తావు కష్టపడని ప్రోత్సహించేవారేని తెలుస్తోంది.