సమంత ప్రధాన పాత్రలో రూపొందిన పౌరాణిక చిత్రం 'శాకుంతలం' సినిమా ఇటీవలే ప్రేక్షకుల ముందుకు వచ్చింది. గుణశేఖర్ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా నిరాశ పరిచింది. ఈ సినిమా ఫెయిల్యూర్ పై సమంత స్పందిస్తూ చాలా లైట్ గానే వ్యాఖ్యలు చేసింది. ఆమె తన తదుపరి ప్రాజెక్ట్ తో బిజీ అయ్యింది. కానీ శాకుంతలంకు వర్క్ చేసిన వారు కొందరు మాత్రం కోలుకోలేక పోతున్నట్లుగా తెలుస్తోంది.
తాజాగా శాకుంతలం సినిమాలో మేనక పాత్రలో కనిపించిన సీనియర్ హీరోయిన్ మధుబాల స్పందించింది. సినిమా ఫెయిల్యూర్ చాలా బాధ కలిగించిందని ఆమె కామెంట్స్ చేసింది. ప్రేక్షకులను మెప్పించడం కోసం ప్రతి ఒక్కరు చాలా కష్టపడి పని చేయడం జరిగింది. ఇలాంటి సినిమా ఫ్లాప్ అవ్వడం బాధాకరం.
మధుబాల ఇంకా మాట్లాడుతూ.. శాకుంతలం సినిమా కోసం దర్శక నిర్మాతలు కష్టపడి పని చేసినప్పటికి కూడా అనుకున్నంత సక్సెస్ దక్కక పోవడం నన్ను చాలా బాధపెట్టింది. సినిమా ప్రీ ప్రొడక్షన్ వర్క్ నుంచి రిలీజ్ అయ్యే వరకు ప్రతి ఒక్కరు ఎంతగా కష్టపడ్డారో నేను చూశాను. ఇంతగా కష్టపడిన సినిమా ఫలితం నిరాశ కలిగించింది.
ప్రేక్షకులకు విజువల్ ట్రీట్ ఇవ్వాలనే ఉద్దేశ్యంతో చిత్ర యూనిట్ సభ్యులు షూటింగ్ పూర్తి అయిన తర్వాత కూడా దాదాపు సంవత్సర కాలం పడ్డ కష్టం గురించి కూడా తెలుసు. సినిమా షూటింగ్ సమయంలో అంతా ప్రశాంతంగా వర్క్ చేసే అవకాశంను మేకర్స్ కల్పించారు. బాహుబలి.. ఆర్‌ఆర్‌ఆర్ సినిమాల విజయాలకు సరైన కారణం లేదు.. మా సినిమా ఇలా బాక్సాఫీస్ వద్ద నిరాశ పర్చుతుందని మేము అనుకోలేదు అని ఆమె పేర్కొన్నారు.