ప్యార్ కియాతో డర్నా క్యా....జబ్ ప్యార్ కియాతో డర్నా క్యా.....ప్యార్ కియా కోయి చోరీ నహీ కీ... చుప్ చుప్ కే ఆహే భర్నా క్యా... మొఘల్ - ఏ- ఆజమ్ చిత్రంలోని ఈ సూపర్ హిట్ సాంగ్ ని పాడని ప్రేమ జంట ఉండదు. ఆ పాటలో అంత అద్భుతంగా నటించారు అలనాటి బాలీవుడ్ స్టార్ హీరోయిన్ మధుబాల. ఆ చిత్రంలో తన నటనతో అనార్కలీ పాత్రకు మధుబాల ప్రాణం పోశారు. కోట్లాది మంది అభిమానులున్నఅలనాటి మేటి నటికి త్వరలోనే అరుదైన గౌరవం దక్కనుంది.
ఢిల్లీలోని ప్రతిష్టాత్మక మేడమ్ టుస్సాడ్ మ్యూజియంలో మధుబాల మైనపు విగ్రహాన్నిఏర్పాటు చేయనున్నామని మ్యూజియం నిర్వాహకులు ప్రకటించారు. మధుబాల మైనపు విగ్రహం రూపొందిస్తున్నందుకు తమకు గర్వంగా ఉందని నిర్వాహకులు పేర్కొన్నారు. మధుబాల అద్భుతంగా నటించిన అనార్కలీ పాత్రను పోలిన మైనపు విగ్రహాన్ని నిర్వాహకులు రూపొందిస్తున్నారు. ఢిల్లీలో మేడమ్ టుస్సాడ్స్ మ్యూజియాన్ని డిసెంబర్‌లో తెరవబోతున్నారు.
1952లో ఓ ప్రముఖ అమెరికన్ మ్యాగజీన్ మధుబాల ఫొటోను ప్రచురించింది. దీంతో, అంతర్జాతీయంగానూ మధుబాల పేరు మారుమోగిపోయింది. మొఘల్-ఏ-ఆజమ్, చల్తీ కా నామ్ గాడీ - మిస్టర్ అండ్ మిసెస్ 55 తదితర చిత్రాల్లో నటించిన మధుబాల1969లో కన్నుమూశారు. తన అందం, అభినయంతో దేశవ్యాప్తంగా కోట్లాది మంది అభిమానులను ఆమె సొంతం చేసుకున్నారు.