ఇప్పటివరకూ చిన్న చిత్రాలనే నిర్మించిన ప్రొడ్యూసర్ మధుర శ్రీధర్.. ఇప్పుడు సీనియర్ వంశీ దర్శకత్వంలో 'ఫ్యాషన్ డిజైనర్ సన్నాఫ్ లేడీస్ టైలర్' మూవీని రూపొందించారు. తాను ఈ చిత్రాన్ని ఓ ప్యాషన్ తో నిర్మించానని చెప్పిన ఆయన.. జూన్ 2న సినిమా రిలీజ్ సందర్భంగా.. సినిమా విశేషాలను 'తుపాకీ'తో పంచుకున్నారు.
'తెలుగులో సీక్వెల్స్ తక్కువ.. ఇప్పుడంటే బాహుబలి ఉంది. కానీ మనకి మనీ లాంటి కొన్ని మాత్రమే సీక్వెల్స్ ఉన్నాయి. అందుకే ఓ సీక్వెల్ ప్లాన్ చేద్దామని అనుకున్నాను. అలాగే విలేజ్ బ్యాక్ డ్రాప్ తో మూవీ చేయాలి.. వంశీతో సినిమా చేయాలన్నది నా చిరకాల కోరిక. అప్పట్లో కె విశ్వనాథ్.. బాపు.. వంశీ.. జంధ్యాల.. ఈ నలుగురు సినీ రంగానికి నాలుగు స్తంభాలు. అలాంటి వంశీతో సినిమా చేయడం చాలా ఆనందంగా అనిపించింది' అన్నారు మధుర శ్రీధర్.
'సింపుల్ గా చెబితే.. లేడీస్ టైలర్ కొడుకు ఇప్పుడేం చేస్తుంటాడు అన్నదే మా సినిమా కథ. మొత్తం 62 రోజులు పల్లెటూళ్లోనే తీశాం. గతంలో వంశీ- ఇళయరాజా.. వంశీ-చక్రి కాంబినేషన్ చూశాం. వంశీ- మణిశర్మ కొత్త కాంబో కొత్తగా ఉంటుంది. నేను సహజంగా చిన్న సినిమాలు తీస్తుంటాను.. కొత్త సంగీత దర్శకులతో ఎక్స్ పెరిమెంట్స్ చేస్తుంటాను. మొదటిసారి ఎక్స్ పీరియన్స్ ఉన్న మ్యూజిక్ డైరెక్టర్ తో చేశాను.. నిజంగా ఆయన మెజీషియన్' అన్నారు ఫ్యాషన్ డిజైనర్ నిర్మాత.
'లేడీస్ టైలర్ కు ఫ్యాషన్ డిజైనర్ స్టోరీకి సంబంధం లేదు. సూపర్ హిట్స్ ఏవీ ప్లాన్డ్ కాదు.. లేడీస్ టైలర్ విషయంలో అప్పుడలా జరిగిపోయిందంతే. ఫ్యాషన్ డిజైనర్ ఓ కొత్త కాన్సెప్ట్.. పల్లెటూళ్లో ఇప్పటి లేడీస్ టైలర్ ఏం చేస్తుంటాడు. ఏ తండ్రీ కొడుకులు ఒకలా ఉండడం సాధ్యం కాదు. అప్పుడు రాజేంద్ర ప్రసాద్ స్టైల్ వేరు.. ఇప్పుడు సుమంత్ అశ్విన్ స్టైల్ వేరు' అన్న మధుర శ్రీధర్.. తాము అనుకున్నది అనుకున్నట్లుగా తీశామనే సంతృప్తిని వ్యక్తం చేశారు.
ఇక దర్శకుడి గురించి మాట్లాడుతూ.. 'వంశీగారితో సినిమా చేయడం సరదాగా ఉంటుంది. వంశీ ఏడిపిస్తారని.. ఓ టాక్ ఉంది. మనం కరెక్ట్ గా ఉంటే అందరూ కరెక్ట్ గా ఉంటారన్నది నా ఫీలింగ్. తనకు కావాల్సిన పెర్ఫామెన్స్ కోసం ఆయన కష్టపెడతారు. హీరో హీరోయిన్లను చెట్టు మీద ఎక్కిస్తాడు.. స్క్రిప్ట్ అప్పటివరకూ ఆ ఉంటుందని తెలిసినా ఎక్కడ తీస్తాడనే విషయం తెలియదు. ఆఖరి నిమిషంలో చెట్టు మీద నుంచి సుమంత్ ను దూకేయమంటాడు. నిజంగానే కొబ్బరి చెట్టుపై నుంచి దూకేశాడు.. ఇవన్నీ ఆఖరి నిమిషంలో ఆయనకు వచ్చే ఎగ్జైట్మెంట్స్ అంతే' అన్న మధుర శ్రీధర్.. ఆయనకు ఆర్డర్ చేయకూడదని అన్నారు. అయితే.. ఈ బడ్జెట్ లో చేద్దాం లాంటి వన్నీ కమ్యూనికేట్ చేస్తే ఎంతో సులభంగా ఆయనతో సినిమా తీయచ్చని అన్నారు. ఇప్పటి కాలం దర్శకుల కంటే ఆయన చాలా అప్డేటెడ్ గా ఉన్నారని నిర్మాత చెప్పడం విశేషం.
'ఇక ఈ మూవీకి ఎంత బడ్జెట్ అయిందని చెప్పే ఉద్దేశ్యం లేదు. మూల కథ మన్మథ రేఖ కాన్సెప్ట్ అనుకోవచ్చు. మొదట రవితేజ కోసం తనికెళ్ల భరణి కథ రాశారు. ఆ తర్వాత నళిని ఆంటీ.. నీకు ఫోనొచ్చింది తీద్దాం అనుకున్నాం. అలాగే రాజ్ తరుణ్ తో చేద్దామని అనుకున్నాం.. బీవీఎస్ రవితో రాయించాం. మొదట సరే అన్నా తర్వాత రాజ్ తరుణ్ కి ఎందుకో నచ్చక తప్పుకున్నాడు. ఆ తర్వాత బాగా ఆలోచించాక తట్టిన కాన్సెప్ట్ మన్మథ రేఖ. లేడీస్ టైలర్ సుందరం కొడుక్కి మన్మథ రేఖ ఉంటే ఎలా ఉంటుందన్నదే ఈ సినిమా' అన్నారు మధుర శ్రీధర్.
టైటిల్ విషయంలో ఎలాంటి ఇబ్బందులు ఎదురు కాలేదన్న ప్రొడ్యూసర్ ' లేడీస్ టైలర్ నిర్మాతలు ఈ ప్రాజెక్టుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు' అని చెప్పారు. ఇక రిజల్ట్ అన్నది ప్రేక్షకుల తీర్పు అంటూ 'సినిమా సక్సెక్ రిలీజ్ రోజున చాలా ఫ్యాక్టర్స్ ఆధారపడి ఉంటాయ్. పోటీగా విడుదలైన సినిమా ఎలా ఉంటుందనే అంశం కూడా ముఖ్యం. మా సినిమా విజువల్ ఫీస్ట్.. ఐదు పాటలు.. నైస్ స్క్రీన్ ప్లే.. చివరికి ఏం జరుగుతుందనే జడ్జిమెంట్ అయితే జనాలు ఇవ్వాల్సిందే' అన్నారాయన.
'నేను సురేష్ బాబు గారు కలిసి పెళ్లిచూపులు రిలీజ్ చేసినపుడు.. మా అగ్రిమెంట్ ప్రకారం ఈ సినిమా రిలీజ్ అంతా సురేష్ మూవీస్ దే బాధ్యత. సురేష్ బాబు అద్భుతంగా సపోర్ట్ చేశారు' అంటూ కృతజ్ఞతలు తెలిపారు మధుర శ్రీధర్.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/