హీరో ధనుష్ కు కోర్టు నోటీసులు

Update: 2016-02-19 08:48 GMT
తమిళ యంగ్ హీరో, రజనీకాంత్ అల్లుడు ధనుష్ కు మద్రాస్ హైకోర్టు నోటీసులు జారీ చేసింది.  టీవీ సీరియల్  - మూవీ డబ్బింగ్ కళాకారులు దాఖలు చేసిన ఓ పిటిషన్ ను  విచారించిన  కోర్టు ఈ నోటీసులు ఇచ్చింది.
  
 హీరో - హీరోయిన్లతో పాటు ఇతర నటీనటులకు  డబ్బింగ్ చెప్పే కళాకారులు తమ వేతనంలో పది శాతాన్ని యూనియన్ కు చెల్లించే  సంప్రదాయం గతంలో తమిళ ఇండస్ర్టీలో ఉండేది. అయితే దీన్ని వ్యతిరేకిస్తూ కొంతమంది కోర్టును ఆశ్రయించారు. ఈ నేపథ్యంలో ఈ చెల్లింపులను నిలిపివేయాలని కోర్టు ఆదేశించింది.  కానీ ధనుష్ కోర్టు ఉత్తర్వులను బేఖాతరు చేశారు.  కళాకారులకు ఇవ్వాల్సిన చెల్లింపులో 10శాతం కోతను యథావిధిగా కొనసాగిస్తున్నారు.  దీనిపై వారు కోర్టు లో పిటిషన్ దాఖలు చేశారు. దీనిని విచారణకు స్వీకరించిన న్యాయమూర్తి టీఎస్‌ శివజ్ఞానం.. దీనిపై వివరణ ఇవ్వాలని కోరుతూ  ఆదేశాలు జారీ చేశారు.  అసోసియేషన్ సెక్రటరీ ప్రకాష్ - అధ్యక్షుడు సెల్వరాజ్ -  దక్షిణ భారత సినీ నటీనటుల సంఘం అధ్యక్షుడు, నిర్మాత  థానులకు ఈ  నోటీసులిచ్చింది.
  
 దక్షిణ భారత సినీ నటీనటుల సంఘం, టీవీ సీరియల్‌ కళాకారుల సంఘంలో సభ్యులుగా ఉన్న తమ వేతనాలలో 10 శాతం యూనియన్ కు చెల్లించే విషయంలో కోర్టు ఉత్తర్వులను  ఉల్లంఘించారంటూ ధనుష్ సహా మరికొంతమంది ప్రముఖులపై  డబ్బింగ్ కళాకారులు కోర్టులో ఫిర్యాదు చేయడంతో ఈ పరిస్థితి ఏర్పడింది. కోడంబాక్కంకు చెందిన మతియాజగన్,  సాలిగ్రామంకు చెందిన ఆర్‌ మహాలక్ష్మి, పీఆర్‌ కణ్ణన్ లు హైకోర్టులో ఈ పిటీషన వేశారు. దీంతో ధనుష్ కోర్టు మెట్లెక్కాల్సి వస్తోంది.
Tags:    

Similar News