మెగాస్టార్ చిరంజీవి - మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ప్రధాన పాత్రల్లో డైరెక్టర్ కొరటాల శివ తెరకెక్కించిన ''ఆచార్య'' సినిమా అన్ని ఫార్మాలిటీస్ పూర్తి చేసుకుని రిలీజ్ కు రెడీ అయింది. ఏప్రిల్ 29న ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ నేపథ్యంలో మేకర్స్ ముమ్మరంగా ప్రచార కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు.
శనివారం సాయంత్రం హైదరాబాద్ యూసఫ్ గూడ పోలీస్ గ్రౌండ్స్ లో గ్రాండ్ గా 'ఆచార్య' ప్రీ రిలీజ్ ఈవెంట్ జరుగుతుండగా.. మేకర్స్ సినిమాలోని 'నీలంబారి' వీడియో సాంగ్ ని రిలీజ్ చేశారు. ఆడియో పరంగా చార్ట్ బస్టర్ గా నిలిచిన ఈ పాట.. వీడియో రూపంలో వీక్షకులను ఆకట్టుకుంటోంది.
'నీలాంబరి నీలాంబరి.. వేరెవ్వరే నీలా మరి.. అయ్యోరింటి సుందరి.. వయ్యారాల వల్లరి.. నీలాంబరి' అంటూ సాగిన ఈ మ్యాజికల్ మెలోడీకి మణిశర్మ సంగీతం సమకూర్చారు. గేయ రచయిత అనంత్ శ్రీరామ్ ట్యూన్ కు తగ్గట్టుగా అందమైన సాహిత్యం అందించారు. యువ గాయనీ గాయకులు అనురాగ్ కులకర్ణి - రమ్య బెహరా కలిసి ఈ గీతాన్ని ఆలపించారు.
అందమైన అవుట్ డోర్ లొకేషన్స్ మరియు స్పెషల్ సెట్ లో రామ్ చరణ్ - పూజా హెగ్డే లపై ఈ మెలోడియస్ డ్యూయెట్ ను చిత్రీకరించారు. ఇందులో చరణ్ వేసిన అదిరిపోయే స్టెప్పులు.. అందాల నీలాంబరి పూజాని వర్ణించే విధానం ఆకట్టుకుంటోంది. శేఖర్ మాస్టర్ ఈ సాంగ్ కు కొరియోగ్రఫీ చేశారు.
తిరునవుక్కరసు సినిమాటోగ్రఫీ అందించగా.. సురేష్ సెల్వరాజన్ ప్రొడక్షన్ డిజైనింగ్ చేశారు. నవీన్ నూలి ఎడిటింగ్ బాధ్యతలు నిర్వహించారు. కొణిదెల ప్రొడక్షన్స్ సమర్పణలో మ్యాట్నీ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై నిరంజన్ రెడ్డి - అన్వేష్ రెడ్డి 'ఆచార్య' చిత్రాన్ని నిర్మించారు.
ఇది నక్సలిజం బ్యాక్ డ్రాప్ లో సందేశాత్మక కథాంశంతో రూపొందుతున్న కమర్షియల్ ఎంటర్టైనర్. ఇందులో చిరంజీవి సరసన కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా నటించింది. సోనూసూద్ - జిషు సేన్ గుప్తా - వెన్నెల కిశోర్ - పోసాని కృష్ణ మురళి - తనికెళ్ళ భరణి - సౌరవ్ లోకేష్ కీలక పాత్రలు పోషించారు.
ఇప్పటికే విడుదలైన ప్రమోషనల్ కంటెంట్ అభిమానుల్ని విపరీతంగా ఆకట్టుకొని సినిమాపై అంచనాలను పెంచేసింది. మెగా తండ్రీకొడుకులు తొలిసారిగా పూర్తి స్థాయిలో స్క్రీన్ షేర్ చేసుకున్న 'ఆచార్య' సినిమా ఎలాంటి సంచలన విజయాన్ని నమోదు చేస్తుందో చూడాలి.
Full View