ప్రతి నిశ్శబ్ధం వెనక ఒక సౌండ్ ఉంటుంది. వినేవాళ్లకే అది వినిపిస్తుంటుంది.. అంటూ మహా సముద్రం థీమ్ ని ఎలివేట్ చేసిన సంగతి తెలిసిందే. శర్వానంద్ - సిద్ధార్థ్ కథానాయకులుగా అజయ్ భూపతి దర్శకత్వం వహిస్తున్న మూవీ `మహా సముద్రం`. ఇదో డీప్ ఇంటెన్స్ ఎమోషన్స్ తో తెరకెక్కిన యాక్షన్ డ్రామా అని చిత్రబృందం చెబుతోంది. ఎకె ఎంటర్ టైన్ మెంట్స్ ఈ చిత్రాన్ని నిర్మిస్తుండగా.. రామబ్రహ్మం సుంకర సమర్పిస్తున్నారు. తెలుగు-తమిళ భాషల్లో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు.
ఇక ఈ చిత్రంలో అతిధీరావ్ హైదరీ- అను ఇమ్మాన్యుయేల్ కథానాయికలుగా నటిస్తుండగా జగపతిబాబు- రావు రమేష్ లాంటి సీనియర్లు కీలక పాత్రల్ని పోషిస్తున్నారు. మూవీలో పాత్రలన్నిటినీ పరిచయం చేస్తూ తాజాగా మహా సముద్రం టీమ్ ఓ వీడియోని రిలీజ్ చేసింది. చెడ్డ వాళ్లయిన విలన్లు.. బిందాస్ అనిపించే హీరోలను కూడా ఈ వీడియోలో ఆవిష్కరించారు. చెడుపై మంచి పోరాటం ఎలా సాగనుంది? అందులో ఎమోషన్ ఏమిటన్నది తెరపైనే చూడాలి. ఇక ఈ చిత్రంలో శర్వానంద్ మాస్ అవతార్ లో కనిపిస్తుండగా.. సిద్ధార్థ్ డ్యూయల్ షేడ్ పాత్రలో కనిపిస్తున్నారు. అతడిలోని లవర్ బోయ్ షేడ్ ని ఎలివేట్ చేయడం ఆసక్తిని కలిగించింది.
`ఫీల్ ది ఇంటెన్సిటీ` అంటూ విజువల్ ని రిలీజ్ చేశారు. ఇందులో పాత్రల తీరుతెన్నులేంటో అర్థమవుతోంది. అయితే టీజర్ కానీ ట్రైలర్ కానీ వస్తే మహా సముద్రం లోతెంతో తెలుస్తుంది. ఆర్.ఎక్స్ 100 ని మించిన డీప్ లవ్ స్టోరీ విత్ ఎమోషన్స్ తీసాడా? లేక ఇందులో ప్రస్థానం తరహాలో పూర్తిగా ఎమోషనల్ డ్రైవ్ తో తీసిన ఎమోషన్ థ్రిల్లర్ మూవీనా? అన్నది చూడాలి. నేపథ్య సంగీతంలో చూస్తుంటే కాస్త ఎమోషన్ పైనే అజయ్ భూపతి దృష్టి సారించారని అర్థమవుతోంది. ఆర్జీవీ టైప్ ఎలివేషన్స్ తో ఎమోషనల్ లవ్ ఎంటర్ టైనర్ ని చూపిస్తున్నారా? అన్నది కాస్త ఆగితే కానీ తెలియదు. ఇకపై ఈ సినిమా నుంచి ఒక్కో పాత్రను ఎలివేట్ చేస్తూ ప్రమోషన్స్ సాగనున్నాయి. దీనిని బట్టి ఒక్కో విషయం బయటపడుతుందన్నమాట.
Full View