సినిమాల విడుదల విషయంలో కొన్ని కాకతాళీయంగా జరిగినా అవే చివరికి సెంటిమెంట్ లాగా అనిపిస్తాయి. గీత గోవిందం సక్సెస్ ఈ రేంజ్ లో ఉంటుందని ఎందరు ఊహించారో కానీ వసూళ్లు మాత్రం అంచనాలకు మించి రావడం చూసి టీమ్ సైతం షాక్ లో ఉంది. ఇక పోతే గీత గోవిందంకు విజయ్ దేవరకొండ క్యామియో చేసిన గత చిత్రం మహానటికి కనిపిస్తున్న పోలికలు ఓ కొత్త సమీకరణను చూపిస్తున్నాయి. అదేంటంటే రెండింటికి థియేట్రికల్ ట్రైలర్ కట్ చేయలేదు. కథలో కీలకమైన పాయింట్ రివీల్ అవుతుందనే ఉద్దేశంతో మహానటి టీమ్ టీజర్ తో సరిపెట్టగా లీకుల గొడవలో పడి డిస్టర్బ్ ఆయిన గీత గోవిందం టీమ్ కూడా ట్రైలర్ వదలకుండానే డైరెక్ట్ మూవీ రిలీజ్ కు వెళ్లిపోయింది. కట్ చేస్తే రెండు దేనికవే వాటి రేంజ్ కు మించిన బ్లాక్ బస్టర్స్ గా నిలిచాయి. రెండూ ఫ్యామిలీ ఆడియన్స్ ని విపరీతంగా ఆకట్టుకున్నాయి.
ఇక్కడ మరో ఆసక్తికరమైన విషయం ఉంది. ఈ రెండు సినిమాలు సాంప్రదాయక సెంటిమెంట్ ను పక్కన పెట్టి రిస్క్ తీసుకుని బుధవారమే విడుదలయ్యాయి. ఫలితం కూడా ఒకేలా దక్కించుకున్నాయి. విజయ్ దేవరకొండను పక్కన పెడితే కీర్తి సురేష్-రష్మిక మందన్నల రేంజ్ అమాంతం పెరిగిపోయింది. ఈ ఏడాది మొత్తంగా బుధవారం విడుదలైన సినిమాలు మూడే. జనవరి 10న అజ్ఞాతవాసి వచ్చింది కానీ అది ఈ సెంటిమెంట్ లెక్కలోకి తీసుకోలేం. దాని ట్రైలర్ విడుదల చేసారు ప్లస్ సంక్రాంతి సీజన్ కాబట్టి దాని ప్లానింగ్ వేరే. ఆ తర్వాత ఈ ఎనిమిది నెలల కాలంలో ట్రైలర్ వదలకుండా బుధవారం విడుదలైన సినిమాలు మహానటి - గీత గోవిందమే. ఇప్పుడు ఈ లెక్క చూసాక విజయ్ దేవరకొండ నెక్స్ట్ సినిమాకు ఇదే ఫాలో అయితే కనక అభిమానులు టీజర్లతోనే సరిపెట్టుకోవాల్సి ఉంటుంది. అయినా ట్రైలర్ లేకుండా హైప్ రాలేని ప్రస్తుత పరిస్థితుల్లో ఈ రెండు కొత్త బెంచ్ మార్క్ సెట్ చేసాయని చెప్పొచ్చు.