అలనాటి మేటి నటి సావిత్రి జీవిత కథ ఆధారంగా తెరకెక్కుతున్న సినిమా మహానటి. భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న సినిమా కోసం సావిత్రి అభిమానులే కాదు... యావత్ తెలుగు సినిమా అభిమానులంతా ఆశగా ఎదురుచూస్తున్నారు. ఆమె జీవితంలోని ఎత్తు పల్లాలను, చావుకి దగ్గరైన సందర్భాలను... ఆ సినిమా ద్వారా తెలుసుకోవాలన్నది ఎంతో మంది ఆశ. మహానటి చిత్రాన్ని ఎలాగైనా మార్చి 29కి విడుదల చేస్తామని చెప్పింది చిత్ర యూనిట్. కానీ ఆ మాటను నిలబెట్టుకునేట్టు కనిపించడం లేదు.
షూటింగ్ పార్ట్ పూర్తయినప్పటికీ ఇంకా గ్రాఫిక్ వర్క్ భారీగా మిగిలిపోయిందట. అది పూర్తవ్వడానికి సమయం పట్టేట్టు కనిపిస్తోందట. అందుకే మార్చి 29న విడుదల వీలు కాదని సమాచారం. అంతే కాకుండా మార్చి 29నే చరణ్-సుకుమార్ కాంబినేషన్‌లో వస్తున్న రంగస్థలం కూడా విడుదల కాబోతోంది. ఆ సినిమాతో క్లాష్ అవసరమా అని కూడా మహానటి చిత్రయూనిట్ భావిస్తోంది. కనుక మరో మంచి తేదీన మహానటిని విడుదల చేయాలనుకుంటోంది. వేసవి సెలవుల్లో విడుదల చేస్తే మంచి ఫలితాలు వస్తాయేమో అని కూడా దర్శక నిర్మాతల ఆలోచన. మే నెలలో భారీ సినిమాలు ఏవీ విడుదలకు లేవు గనుక... ఆ నెలలో విడుదల చేయాలని కూడా అనుకుంటున్నట్టు సమాచారం. అయినా భారీ బడ్జెట్ చిత్రాలు ఇలా వాయిదాలు పడడం మనకు కొత్తా ఏమిటి? ఎన్నో సినిమాలు విడుదల తేదీలు మార్చుకుంటున్నాయి... ఆ కోవలోకే వస్తుంది మహానటి కూడా.
మహానటిలో సావిత్రిగా ముద్దుగుమ్మ కీర్తి సురేష్ నటిస్తుండగా, సమంత - దుల్కర్ సల్మాన్ - విజయ్ దేవరకొండ ఇతర ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు. ఎవడే సుబ్రహ్మణ్యం ఫేం నాగ అశ్విన్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నాడు.