మ‌హాన‌టి వ‌చ్చేది ఆ నెల‌లోనేనా?

Update: 2018-03-07 12:22 GMT
అబ్బ‌బ్బా... ఎన్ని క‌బ‌ర్లు చెప్పారు... చెప్పిన తేదీకి సినిమాను విడుద‌ల చేసి తీరుతామ‌న్నారు.. షూటింగ్ చ‌క‌చ‌కా చేస్తున్నామ‌న్నారు... తీరా చూస్తే... చెప్పిన తేదీకి కాదు క‌దా... మ‌రొక మూడు నెల‌లు విడుద‌ల‌య్యే అవ‌కాశ‌మే క‌నిపించ‌డం లేదు. ఇదంతా చెప్పే మ‌హాన‌టి సినిమా గురించే. సావిత్రి జీవిత క‌ధ‌నే మ‌హాన‌టి పేరుతో సినిమా తీస్తున్నారు అశ్వినీద‌త్ అల్లుడు నాగాశ్విన్‌.

ముందు చెప్పిన దాని ప్ర‌కారం... మ‌హాన‌టి మార్చి 29కి విడుద‌ల కావాలి. ఇంకా 20 రోజులే ఉంది. కానీ ఇంకా షూటింగ్ మిగిలే ఉంది. గ్రాఫిక్స్ ప‌నులు మిగిలిపోయాయి. పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ ప‌నులు అవ్వాలి. ఇర‌వై రోజుల్లో ఇన్ని పనులు అవ్వ‌డం అసాధ్యం. అంతే కాదు మార్చి 30న రంగ‌స్థ‌లం సినిమా కూడా విడుద‌ల‌వుతోంది. ఇప్ప‌టికే షూటింగ్ పూర్తి చేసుకోవ‌డంతో పాటూ విడుద‌ల‌కు అన్ని విధాలుగా సిద్ధ‌మైపోతోంది. ఈ రెండూ సినిమాలు 1980ల నాటి కాలానివే. క‌నుక మ‌హాన‌టి... రంగ‌స్థ‌లం ఒకేసారి విడుద‌ల చేయ‌డం కూడా క‌రెక్టు కాద‌ని భావిస్తోంది మ‌హాన‌టి చిత్ర‌యూనిట్. పోనీ ఓ నెల రోజుల త‌రువాత విడుద‌ల చేద్దామా అంటే కుదిరేట్టు లేదు.

భ‌ర‌త్ అను నేను... నా పేరు సూర్య‌... లాంటి పెద్ద సినిమాలు ఏప్రిల్ మేల‌లో ఉన్నాయి. ఆ సినిమాల‌తోనూ పోటీ ప‌డ‌డం మంచిది కాదేమో అని ఆలోచిస్తోంది చిత్ర‌యూనిట్. అంతేకాదు థియేట‌ర్లు కూడా ఖాళీగా ఉండ‌వు అందుకే విడుద‌ల తేదీని జూన్‌ కు వాయిదా వేద్దామ‌ని అనుకుంటున్న‌ట్టు స‌మాచారం. రెండు మూడు రోజుల్లో ఏదో ఒక నిర్ణ‌యం తీసుకుని అధికారికంగా ప్ర‌క‌టించేందుకు సిద్ధ‌మ‌వుతోంది చిత్ర‌యూనిట్‌. మ‌హాన‌టిని చూడాలంటే ఇంకా మ‌నం కొన్ని నెల‌లు వేచి యుండాల్సిందే.
Tags:    

Similar News