అలనాటి మేటి నటి సావిత్రి జీవిత గాథతో వచ్చిన మహానటి అన్ని వర్గాల ప్రేక్షకులకు నచ్చేసింది. నచ్చడమంటే అలా.. ఇలా కాదు. బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షం కురుస్తోంది. మిగిలిన సినిమాలు తీసేసి మరీ మహానటికి థియేటర్లు ఇస్తున్నారు. మల్టీప్లెక్సుల్లో షోలు పెంచుతున్నారు. రిలీజయిన అతి తక్కువ టైంలో మహానటి ప్రాఫిట్ జోన్ లోకి వచ్చేసింది.
మహానటి సినిమాపై నిర్మాతలకున్న నమ్మకం వాళ్లకు మామూలుగా ప్లస్సవలేదు. ఎందుకంటే రిలీజ్ కు ముందు టీవీ ఛానళ్లు దీనిని చిన్న సినిమాగానే లెక్కేశాయి. శాటిలైట్ రైట్స్ గా రూ. 5 కోట్లు మాత్రం ఇస్తామంటూ ఆఫర్ ఇచ్చాయి. అంతతక్కువ మొత్తానికి రైట్స్ ఇవ్వడానికి నిర్మాతలు ఇష్టపడలేదు. సినిమా రిలీజ్ అయ్యాకే రైట్స్ గురించి మాట్లాడాలని డిసైడ్ అయ్యారు. అదే ఇప్పుడు వారికి వరంగా మారింది. మహానటి బ్లాక్ బస్టర్ హిట్ కావడంతో ఈ సినిమా శాటిలైట్ రైట్స్ కు బాగా డిమాండ్ పెరిగింది. రిలీజయిన మొదట్లో రూ. 11 కోట్లు ఇస్తామన్న ఛానళ్లు ఇప్పుడా మొత్తానికి రూ. 22 కోట్లకు పెంచాయి.
ఇంత భారీ మొత్తం ఆఫర్ వచ్చినా నిర్మాతలు అశ్వనీదత్ - ఆయన కుమార్తెలు ఇంకా శాటిలైట్ రైట్స్ పై డెసిషన్ తీసుకోలేదు. ఇప్పటికీ దీనిపై చర్చలు జరుపుతూనే ఉన్నామని అంటున్నారు. మహానటి సినిమా సినిమా దాదాపు రూ. 25 కోట్లు పెట్టి తీశారు. ఇప్పుడు ఆ మొత్తం శాటిలైట్ రైట్స్ రూపంలోనే వచ్చేస్తున్నాయి. ఓ రకంగా చెప్పాలంటే ఇది మహానటి సావిత్రిపై జనాలకు ఉన్న అభిమానానికి ఓ నిదర్శనం.