సూపర్ స్టార్ మహేష్ కథానాయకుడిగా నటించిన 25వ సినిమా మహర్షి ప్రపంచవ్యాప్తంగా రిలీజైన సంగతి తెలిసిందే. తొలిరోజు యథావిధిగా క్రిటిక్స్ నుంచి మిశ్రమ స్పందనలు వచ్చాయి. తొలి వీకెండ్ రికార్డుల గురించి మాటా మంతీ సాగుతున్నా సోమవారం తర్వాత ఈ సినిమా అసలు సత్తా ఎంతో తెలుస్తుందని ట్రేడ్ వర్గాలు విశ్లేషిస్తున్నాయి. రిషీ లో .. కాలేజ్ స్టూడెంట్.. కార్పొరెట్ సీఈవో.. రైతన్న కోణాల్ని పైడిపల్లి తెరపై చూపించారు. ఒక మనిషి జీవితంలో ఎదగడం అంటే ఏమిటి? ఏం సాధిస్తే ఎదిగినట్టు? అన్న సింపుల్ పాయింట్ తో ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. ఇక ఈ సినిమాలో శ్రీమంతుడు షేడ్స్ కనిపించడంపైనా.. సుధీర్ఘ నిడివిపైనా అభిమానుల్లో ఆసక్తికర చర్చ సాగుతోంది.
తాజాగా సూపర్‌స్టార్ కృష్ణ కుటుంబ సభ్యుల కోసం ఏఎంబీలో స్పెషల్ షో వేసారని తెలుస్తోంది. సూపర్ స్టార్ కృష్ణ- విజయనిర్మల దంపతులు.. నరేష్ ఫ్యామిలీ సహా బంధుమిత్రుల ఫ్యామిలీలు ఈ షోని వీక్షించారు. షో వీక్షించిన అనంతరం సూపర్ స్టార్ కృష్ణ మాట్లాడుతూ.. మహేష్ రిషీ పాత్రను మూడు ఆసక్తికర కోణాల్లో పైడిపల్లి అద్భుతంగా చూపించారని ప్రశంసించారు. ఇప్పటికే తాను ఈ సినిమాని రెండోసారి వీక్షించానని సీనియర్ నరేష్ వెల్లడించారు.
అలాగే మరోవైపు మహేష్ - దిల్ రాజు- పీవీపీ- దత్- వంశీ పైడిపల్లి- పూజా హెగ్డే & టోటల్ బృందం పార్టీతో చిలౌట్ చేసిన ఫోటోలు అంతర్జాలంలోకి వచ్చాయి. ఈ బృందంలో దేవరకొండ కనిపించడం ఆసక్తికరం. ఇక థియేటర్ల రెస్పాన్స్ ఎలా ఉందో రెగ్యులర్ గా దిల్ రాజు బృందం విజిట్ చేస్తోంది. వరుసగా సక్సెస్ మీట్ల పేరుతో ప్రచార కార్యక్రమాలకు దిల్ రాజు ప్లాన్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రాన్ని దాదాపు 130 కోట్ల బడ్జెట్ తో దిల్ రాజు-అశ్వనిదత్- పీవీపీ సంయక్తంగా తెరకెక్కించిన సంగతి తెలిసిందే.