సూపర్ స్టార్ మహేష్ బాబు మహర్షి గురించి టీమ్ ఎపిక్ బ్లాక్ బస్టర్ అంటూ ప్రిన్స్ కెరీర్ బెస్ట్ అంటూ ఎంత ఊదరగొట్టినా ఆ స్థాయి ఫలితాలు దక్కలేదన్నది కళ్ళముందు కనిపిస్తున్న వాస్తవం. తన కెరీర్ లోనే ఎన్నడూ చేయనంత అగ్రెసివ్ ప్రమోషన్ చేసినా మహేష్ కు దాని ఫలాలు పూర్తిగా అందలేదు. జరిగిన థియేట్రికల్ బిజినెస్ పెట్టుబడి 95 కోట్లు వస్తే చాలు అనేలా ఉంది పరిస్థితి,. ఇక నాన్ బాహుబలి రికార్డుల గురించి మర్చిపోవడమే మంచిది.
తెలుగు రాష్ట్రాలలో చాలా ఏరియాలలో సేఫ్ వెంచర్ గా నిలిచిన మహర్షి మహేష్ కు బాగా పట్టున్న ఓవర్సీస్ లో మాత్రం నష్టాలకు గురి చేయడం షాక్ కలిగిస్తుంది. ఇప్పటిదాకా మహర్షి వసూలు చేసింది 1.83 మిలియన్ డాలర్లు మాత్రమే. కనీసం రెండు మార్కు టచ్ చేస్తుందన్న నమ్మకం కూడా అక్కడి ట్రేడ్ లో పెద్దగా లేదు. ఈ లెక్కన సుమారు 2 కోట్ల దాకా అక్కడి బయ్యర్ కు నష్టం తప్పేలా లేదు. ముందస్తు చేసుకున్న ఒప్పందంలో భాగంగా దిల్ రాజు ఓ కోటి దాకా భరించినా మిగిలిన మొత్తం నెట్ లాస్ కిందకే వస్తుంది. ఇది ఊహించనిది.
మహర్షి అక్కడి ప్రేక్షకులకు నచ్చలేదు అనడానికి ఈ ఫిగర్స్ సాక్ష్యంగా నిలుస్తున్నాయి. గీత గోవిందం-మహానటి లాంటి మీడియం రేంజ్ సినిమాలు సైతం ఈజీగా అందుకున్న 2 మిలియన్ మార్క్ ని మహర్షి చేరుకోలేకపోవడం షాక్ అనే చెప్పాలి. ఫైనల్ రన్ అక్కడ ఆల్మోస్ట్ వచ్చేసినట్టే. వీక్ అపోజిషన్ వల్ల ఇక్కడ మహర్షి స్లో అండ్ స్టడీగా వీకెండ్స్ తో గట్టెక్కుతున్నాడు. అయినా కూడా శ్రీమంతుడు పోకిరి లాంటి ఇండస్ట్రీ హిట్స్ సంగతేమో కానీ ఇప్పుడు మాత్రం భరత్ అనే నేనుని దాటితే చాలు అనేలా ఉంది పరిస్థితి