సూపర్ స్టార్ ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా ఏడాది గ్యాప్ తర్వాత వస్తున్న మూవీగా మహర్షి మీద అభిమానుల్లో ఎలాంటి అంచనాలు ఉన్నాయో మాటల్లో చెప్పడం కష్టం. విడుదలకు ఇంకో ఎనిమిది రోజులే ఉన్న నేపధ్యంలో ఇవాళ ప్రీ రిలీజ్ ఈవెంట్ తో వాళ్ళ ఉత్సాహం పీక్స్ కు చేరుకుంది. నెక్లెస్ రోడ్ లోని పీపుల్స్ ప్లాజాలో విక్టరీ వెంకటేష్ విజయ్ దేవరకొండలు ముఖ్య అతిధులుగా ఇందాక అంగరంగ వైభవంగా జరిగిన వేడుకలో కోట్లాది కళ్ళతో ఎదురు చూస్తున్న థియేట్రికల్ ట్రైలర్ ని రిలీజ్ చేసారు. అందులో విషయానికి వస్తే కథ చెప్పి చెప్పకుండా చాలా తెలివిగా కట్ చేశారు
రిషి కాలేజీలో స్టూడెంట్. అమ్మనాన్నా(జయసుధ-ప్రకాష్ రాజ్)ల మధ్యతరగతి జీవితానికి భిన్నంగా ప్రపంచాన్ని ఏలే స్థాయిలో ఏదైనా సాధించాలి అనే లక్ష్యంతో ఉంటాడు. క్యాంపస్ లో అమాయకుడైన రవి(అల్లరి నరేష్)తో స్నేహం చురుగ్గా ఉండే పూజా(పూజ హెగ్డే)తో ప్రేమ అంతా సరదాగా గడిచిపోతుంది. చదువు పూర్తయ్యాక రిషి కోరుకున్నది సాధించి విదేశాలకు వెళ్తాడు. కలలు కన్న సక్సెస్ ని సాధించి అందరికి ఆదర్శంగా నిలుస్తాడు.
కాని అనూహ్యంగా జరిగిన పరిణామాల వల్ల తిరిగి ఇండియాకు రావాల్సి వస్తుంది. వ్యాపారవేత్త(జగపతిబాబు)ను సవాల్ చేసే పరిస్థితి కలుగుతుంది. గ్రామానికి వెళ్లి హలం పట్టి పొలం దున్నే రోజు కలుగుతుంది. అసలు రుషి జీవితంలో ఇంత మార్పు ఎందుకు వచ్చింది అంత గొప్ప లైఫ్ ని వదిలి గ్రామానికి ఎందుకు వచ్చాడు రవికి రిషికి మధ్య ఉన్న అనుబంధం ఏంటి లాంటి ప్రశ్నలకు సమాధానం ధియేటర్లో వెతకాల్సిందే
ట్రైలర్ ని అవసరం లేని హీరోయిజంతో కాకుండా చాలా నీట్ గా కట్ చేశారు. రిషి పాత్రలోని కాన్ఫిడెన్స్ ని రావు రమేష్ ఝాన్సీల పాత్ర ద్వారా చెప్పించిన తీరు ఆకట్టుకుంది. మహేష్ లుక్స్ తోనూ రెండు డిఫరెంట్ షేడ్స్ తోనూ అదరగొట్టాడు. విద్యార్ధిగా గెడ్డం మీసంతో బిజినెస్ మెన్ గా దానికి విరుద్ధమైన గెటప్ తో ఫాన్స్ తోనే కాదు ప్రేక్షకులను కూడా వాహ్వా అనిపిస్తాడు. మిగిలిన ఆర్టిస్టులను ఒక్కో సీన్ లో మాత్రమే రివీల్ చేసారు.
పూజా హెగ్డే ఎప్పటిలాగే క్యుట్ గా ఉంది. అల్లరి నరేష్ పాత్రకు సంబంధించి ఎక్కువ క్లూస్ ఇవ్వలేదు. మోహనన్ ఛాయాగ్రహణం రామ్ లక్ష్మణ్ పోరాటాలు హై స్టాండర్డ్ లో ఉన్నాయి. దేవి సంగీతం సైతం బాగానే ఎలివేట్ అయ్యింది. సంభాషణలు ప్రధాన ఆకర్షణగా నిలుస్తున్నాయి. వంశీ పైడిపల్లి ట్రేడ్ మార్క్ మేకింగ్ స్టైల్ ఆసక్తి రేపెలా ఉంది. మొత్తానికి మహర్షిలో కోరుకున్నవన్నీ ఉన్నాయని భరోసా ఇచ్చేలా ట్రైలర్ సాగడం శుభ శకునమే
Full View