తాజా ఆస్కార్ అవార్డుల్లో గొప్ప ప్రత్యేకత ఒకటి ఉంది. 89 ఏళ్ల అకాడమీ అవార్డుల చరిత్రలో తొలిసారి ఓ ముస్లిం నటుడికి ఈసారి ఆస్కార్ దక్కింది. మూన్‌లైట్ సినిమా కోసం బెస్ట్ సపోర్టింగ్ యాక్టర్ గా మెహర్షలా అలీ నిలిచాడు. ఇదే అవార్డు రేసులో ఉన్న భారత సంతతి నటుడు దేవ్ పటేల్ ను వెనక్కి నెట్టి అలీ ఆస్కార్‌ను అందుకోవడం విశేషం. ప్రస్తుతం అమెరికాలో నెలకొన్న పరిస్థితులను చూస్తే ఈ అవార్డు మరింత ప్రత్యేకమనే చెప్పుకోవాలి. ట్రంప్ అధ్యక్షుడైన తర్వాత ఏడు ముస్లిం దేశాల వారిపై నిషేధం విధించిన నేపథ్యంలో ఓ ముస్లిం అమెరికన్ ప్రతిష్టాత్మక అకాడమీ అవార్డు తొలిసారి అందుకోవడం విశేషమే.
తొమ్మిది దశాబ్దాల రికార్డును బద్దలుకొట్టి అవార్డును సొంతం చేసుకున్న సందర్భంగా అలీ ఎంతో భావోద్వేగంతో ప్రసంగించాడు. తన గురువులకు కృతజ్ఞతలు చెప్పాడు. "ఇది నా గొప్పతనం కాదు...ఈ క్యారెక్టర్ గొప్పతనం. నేను కేవలం ఓ సర్వెంట్ నే. ఈ స్టోరీలు, ఈ క్యారెక్టర్లకు నేను సేవ చేశాను" అని అలీ అన్నాడు. తన కెరీర్ మొత్తం వెన్నంటి ఉండి అండగా నిలిచిన తన భార్యకు కూడా అలీ థ్యాంక్స్ చెప్పాడు.
అయితే ఇంతటి ప్రత్యేకతను సంపాదించిన అలీ నేపథ్యం కూడా విభిన్నమే. కాలిఫోర్నియాలోని ఓక్లాండ్‌లో 1974లో అలీ జన్మించాడు. అతను పుట్టుకతో క్రిస్టియన్! అతనికి తన తల్లి విలిసియా పెట్టిన పేరు మెహర్షెలా గిల్మోర్. అయితే ఆ తర్వాత అతను ఇస్లాం మతాన్ని స్వీకరించాడు. తన సర్‌నేమ్‌ను గిల్మోర్ నుంచి అలీగా మార్చుకున్నాడు. ఆ తర్వాత అహ్మదీయ ముస్లిం కమ్యూనిటీలో చేరాడు. మొరాగాలోని సెయింట్ మేరీస్ కాలేజ్ ఆఫ్ కాలిఫోర్నియాలో చదువుకున్నాడు. మాస్ కమ్యూనికేషన్‌లో 1996లో డిగ్రీ పూర్తి చేశాడు. 2008లో రిలీజైన ద క్యూరియస్ కేస్ ఆఫ్ బెంజమిన్ బటన్ సినిమాతో మంచి పేరు సంపాదించాడు. ఇందులో అతను పోషించిన రిచర్డ్ టైలర్ కేరక్టర్‌తో అలీకి మంచి గుర్తింపు లభించింది.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/