కుడి ఎడమైతే పొరపాటు లేదోయ్.. ఓడిపోలేదోయ్!.. ఇదీ సుక్కూ సన్నివేశం!! సూపర్ స్టార్ మహేష్ తో చేయాల్సిన స్క్రిప్ట్ తో అల్లు అర్జున్ హీరోగా పుష్ప చిత్రాన్ని తెరకెక్కించాడు సుకుమార్. అప్పట్లో పలు దఫాలు మహేష్ బాబుతో స్క్రిప్టు పరంగా చర్చలు సాగించినా కానీ ఎందుకనో ప్రాజెక్ట్ వర్కవుట్ కాలేదు. మహేష్ పదే పదే స్క్రిప్టులో మార్పులు చేర్పులు సూచించడంతో చాలా ఓపిగ్గా ప్రయత్నించి చివరకు సుకుమార్ ఆ తర్వాత ప్రాజెక్ట్ నుంచి తప్పుకుంటున్నట్టు ప్రకటించారు. మహేష్ నుంచి ఎగ్జిట్ అయిన కొద్ది రోజుల్లోనే ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తో సినిమాని సుకుమార్ ప్రకటించారు. అక్కడ మహేష్ కి వినిపించిన స్క్రిప్ట్ తోనే బన్నీతో సినిమా చేస్తున్నాడన్న చర్చ సాగింది.
ఇదంతా గడిచిన స్టోరి అనుకుంటే వర్తమానంలో ఐకాన్ స్టార్ కి కెరీర్ బెస్ట్ హిట్ ని `పుష్ప- ది రైజ్` రూపంలో అందించాడు సుకుమార్. ఆర్య- ఆర్య 2 తర్వాత ఈ కాంబినేషన్ లో అద్భుతమైన సినిమా వచ్చిందని బాక్సాఫీస్ ఫలితం క్లియర్ కట్ గా నిరూపించింది. గంధపు చెక్కల స్మగ్లింగ్ అడవుల నేపథ్యంలో రా అండ్ రస్టిక్ స్టోరీతో సుకుమారు ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. బన్ని ఇందులో లారీ డ్రైవర్ గా గంధపు చెక్కల్ని తరలించే మాఫియా మేన్ గా అద్భుతంగా నటించారు. నటుడిగా గొప్ప ప్రశంసలు అందుకోవడమే గాక కెరీర్ బెస్ట్ హిట్ ని అందుకున్నాడు. ఆసక్తికరంగా పుష్ప 1తో బంపర్ హిట్ కొట్టాడు కాబట్టి తిరిగి పుష్ప 2తో ఇంకా పెద్ద విజయం అందుకుంటాడన్న చర్చ సాగుతోంది.
చాలా మంది సినీ ప్రముఖులు నటీనటులు పుష్ప గా బన్నీ నటనపై ప్రశంసల వర్షం కురిపించారు. ఇంతకుముందు ట్రైలర్ చూడగానే వెంటనే వచ్చిన రియాక్షన్లు తెలిసినదే. అయితే సాధారణంగా కొత్త సినిమా లేదా ట్రైలర్ గురించి ఏదైనా ట్వీట్ చేసే ప్రముఖుల్లో ఇద్దరు టాప్ హీరోలు ఉన్నారు. కానీ వారు ఈసారి ఎందుకనో చాలా కాలం పాటు మౌనంగానే ఉండిపోయారు. ఒకరు రాజమౌళి కాగా మరొకరు సూపర్ స్టార్ మహేష్ బాబు. చివరగా పుష్పను చూసిన తర్వాత మహేష్ బాబు నుండి ట్వీట్ వచ్చింది. ``పుష్ప రా- గ్రామీణ సినిమా..సుక్కూ మరోసారి క్రూరమైన నిజాయితీని నిరూపించారు. పుష్ప పాత్రలో అల్లు అర్జున్ స్టన్నింగ్.. ఒరిజినల్ .. సెన్సేషనల్ అని కూడా మహేష్ ప్రశంసించారు. ఎప్పటిలాగే DSP ని రాక్ స్టార్ అని పొగిడేశారు. సూపర్ స్టార్ మహేష్ ఇటీవల షూటింగులు సహా విదేశాల్లో శస్త్ర చికిత్స వల్ల ఆలస్యంగా ఇప్పటికి పుష్పను చూసినట్లుగా కనిపిస్తోంది. అందుకే ప్రశంసలతో ట్వీట్లు చేశారు.
దర్శకుడు సుకుమార్ తో మహేష్ కి కటీఫ్ అయ్యింది కాబట్టి మహేష్ పుష్ప గురించి ఏమీ చెప్పలేదని చాలా మంది అనుకున్నారు. కానీ ఇప్పుడు నిష్కల్మశంగా సుకుమార్ మేకింగ్ ని నిజాయితీని ప్రశంసలతో ముంచెత్తారు. మొత్తం టీమ్ ను అభినందించారు. అలాగే మహేష్ విషయంలో సుక్కూ ఎప్పుడూ వినయవిధేయతలను కలిగి ఉన్నారు. ఉప్పెన సమయంలో మహేష్ బాబు అభినందించగా.. సుకుమార్ కృతజ్ఞతలు తెలిపారు. భవిష్యత్ లో సుకుమార్ తో మహేష్ పాన్ ఇండియా చేసేందుకు ఆస్కారం లేకపోలేదు. రాజమౌళితో మహేష్ తన సినిమాని పూర్తి చేశాక అయినా ఈ కాంబినేషన్ సెట్ అవుతుందేమో చూడాలి. మరోవైపు ఫిబ్రవరి నుంచే పుష్ప 2 ని ప్రారంభిస్తామని సుకుమార్ ప్రకటించడంతో బన్నీ లాక్ అయినట్టేనని భావించవచ్చు.