కంప్యూటర్ గ్రాఫిక్స్ తో భరత్ ఫైటింగ్స్

Update: 2018-03-20 06:22 GMT
మహేష్ బాబు కొత్త సినిమా పనులు చకచకా పూర్తయిపోతున్నాయి. సరిగ్గా ఇవాల్టి నుంచి నెల రోజుల్లో 'భరత్ అనే నేను' రిలీజ్ చేయాల్సి ఉంది. ఏప్రిల్ 20న షెడ్యూల్ చేసిన ఈ చిత్రం కోసం.. అటు షూటింగ్ ఫైనల్ టచెస్ తో పాటు.. పోస్ట్ ప్రొడక్షన్ పనులు కూడా చకచకా సాగుతున్నాయి.

పొలిటికల్ బేస్డ్ కమర్షియల్ మూవీగా రూపొందుతున్న భరత్ అనే నేను చిత్రానికి.. కొరటాల శివ దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ చిత్రంలో యాక్షన్ ప్యాక్డ్ ఎపిసోడ్స్ కూడా ఉంటాయనే సంగతి టీజర్ లో చూపించారు కూడా. ఇంటర్వెల్ బ్యాంగ్.. క్లైమాక్స్ లో వచ్చే ఫైటింగ్ సన్నివేశాలు.. మాస్ ఆడియన్స్ ను విపరీతంగా అలరిస్తాయనే టాక్ ఉంది. వీటికి గ్రాండ్ లుక్ ఇవ్వడం కోసం కంప్యూటర్ గ్రాఫిక్స్ ను కూడా జోడిస్తున్నారట. ఇప్పటికే సీజీ వర్క్ ఫుల్ స్వింగ్ లో ఉందని తెలుస్తోంది. ఈ గ్రాఫిక్స్ ను మిక్స్ చేయడం ద్వారా.. ఆ యాక్షన్ ఎపిసోడ్స్ కు మరింతగా సొగసులు అద్దుతున్నారని తెలుస్తోంది.

భరత్ అనే నేను మూవీలో మొత్తం 10 నిమిషాల పాటు యాక్షన్ బ్లాక్స్ ఉంటాయని తెలుస్తోంది. మూవీలో ముఖ్యమంత్రి పాత్రలో నటిస్తున్న మహేష్ బాబు ఎంతో క్లాస్ గా నటించినా.. ఫైటింగ్ సన్నివేశాల్లో మాత్రం మహా మాస్ అనిపించే రేంజ్ లో.. వీటిని చిత్రీకరించారని తెలుస్తోంది. ఇకపోతే త్వరలోనే స్పెయిన్‌ వెళ్ళి.. అక్కడ కొన్ని సీన్లు ఒక రెండు పాటలనూ తీసి.. సినిమా షూటింగ్ మొత్తంగా ముగిస్తారట. బాలీవుడ్ భామ కైరా అద్వానీ హీరోయిన్ గా నటించిన ఈ చిత్రానికి.. దేవిశ్రీ ప్రసాద్ అందించిన సంగీతం మరో హైలైట్ కానుంది.


Tags:    

Similar News