శ్రీమంతుడు సినిమా చేస్తున్నప్పుడు తన బావ.. గుంటూరు ఎంపీ గల్లా జయదేవ్.. ఊరిని దత్తత తీసుకుంటే బాగుంటుందని చెప్పారని.. తాను అదే అనుకున్నానని.. కాకుంటే.. ఆ విషయాన్ని షూటింగ్ సమయంలో ప్రకటిస్తే.. అదేదో సినిమా పబ్లిసిటీ కోసం చేస్తున్నట్లుగా భావిస్తారని తాను ఈ విషయాన్ని చెప్పలేదంటూ ప్రిన్స్ మహేశ్ బాబు ఈ మధ్య చెప్పటం తెలిసిందే.
మరి.. బావ చెప్పారో.. లేదంటే సొంతంగా ఆలోచించారో కానీ.. ఇప్పటికే ఏపీలో తన తండ్రి స్వగ్రామమైన బుర్రిపాలెం గ్రామాన్ని దత్తత తీసుకోనున్నట్లు ప్రకటించిన సంగతి తెలిసిందే. తన తండ్రి.. సూపర్ స్టార్ కృష్ణ జన్మస్థానమైన బుర్రిపాలెన్ని దత్తత తీసుకోనున్నట్లు ప్రకటించారు.
ఊరి దత్తత విషయంలో బావ సలహా ఇచ్చారని చెప్పిన మహేశ్ బాబు.. ఎవరు సలహా ఇచ్చారేమో కానీ.. ఏపీ ముఖ్యమంత్రి గతంలో చెప్పిన రెండు కళ్ల సిద్ధాంతాన్ని మహేశ్ పాటించినట్లు కనిపిస్తోంది. తాజాగా.. ఆయన తెలంగాణ రాష్ట్రంలోని మహబూబ్ నగర్ జిల్లాలోని ఒక ఊరిని దత్తత తీసుకోనున్నట్లు కొద్దిసేపటి క్రితం ట్విట్టర్ లో పేర్కొన్నారు. చూస్తుంటే.. శ్రీమంతుడి దత్తత వ్యవహారం కాస్తంత దూరదృష్టితో ఉన్నట్లు కనిపిస్తుందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది