మహేష్ కు కొంత మంది సక్సెస్ లో ఉన్న సెలెక్టెడ్ డైరెక్టర్స్.. సెలెక్టెడ్ ప్రొడ్యూసర్స్ అనే కోటరీ ఉంటుందని అప్పట్లో స్టార్ డైరెక్టర్ పూరి వేసిన పంచ్ గుర్తుందా? ఆ తర్వాత ఇదే మాట పూరీనే ప్రశ్నిస్తే పాత గాయాన్ని కెలకడమెందుకు అని లైట్ తీస్కున్నారు.
నిజమే సక్సెస్ లేనిదే ఏదీ లేదిక్కడ. సక్సెస్ ఇచ్చేవాళ్ల వెంటపడడం మన స్టార్ హీరోల అలవాటు. అయితే ఆ నమ్మకం అండర్ ప్రొడక్షన్ .. సెట్స్ లో ఉన్నప్పుడే తెచ్చుకుంటేనే మళ్లీ మళ్లీ కాంబినేషన్ రిపీటవుతుంది. సక్సెస్ ఇవ్వలేని వారితో అంటకాగడం ఎలా కుదురుతుంది? అందుకే సక్సెస్ ఇచ్చే వారితో తప్ప మరొకరితో సినిమా చేయడానికి ఆసక్తి చూపించరు. అలా ఇండస్ట్రీలో అగ్ర హీరోలందరికీ కోటరీలు ఉన్నాయి. చిరంజీవి- బాలకృష్ణ- నాగార్జున- వెంకటేష్ వీళ్లందరికీ కోటరీలు ఉన్నాయి. కొత్త ట్యాలెంటు ప్రవేశంతో కోటరీలకు బీటలు వారాయి. స్టార్ హీరోలు కూడా ఎవరు నచ్చితే వారితో సినిమా చేయడం మొదలైంది. అయితే నచ్చిన దర్శకుడితో మరో సినిమా వెంట వెంటనే అన్నదే ఇటీవల ఎంత మాత్రం కుదరడం చాలా అరుదు అయ్యింది. అయితే దీనిని బ్రేక్ చేస్తూ.. యంగ్ డైరెక్టర్ అనిల్ రావిపూడి మహేష్ తో వెంట వెంటనే ప్రాజెక్టులు సొంతం చేసుకున్నాడని తెలిసింది.
`ఎఫ్ 2`తో వంద కోట్ల క్లబ్ లో చేరిన అనిల్ రావిపూడి తాజాగా మహేష్ కథానాయకుడిగా `సరిలేరు నీకెవ్వరు` చిత్రాన్ని రూపొందిస్తున్న విషయం తెలిసిందే. దిల్ రాజు-అనిల్ సుంకర ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. అనిల్ రావిపూడి మార్కు ఎంటర్ టైనర్ గా రూపొందుతున్న ఈ సినిమా చిత్రీకరణ ప్రస్తుతం హైదరాబాద్ లో జరుగుతోంది. సంక్రాంతికి హంగామా చేయాలని ప్లాన్ చేస్తున్నారు. ఈ మూవీ చిత్రీకరణ దశలో వుండగానే అనిల్ రావిపూడికి మహేష్ మరో ఛాన్స్ ఇచ్చినట్లు తెలిసింది. అనిల్ వర్కింగ్ స్టైల్ మహేష్ కు విపరీతంగా నచ్చేసిందట. దాంతో వెంటనే తనకు మరో సినిమా అవకాశం ఇచ్చినట్లుగా చెబుతున్నారు. అయితే మధ్యలో వేరొక సినిమా చేశాక.. మళ్లీ రావిపూడితో సెట్స్ పైకి వెళతాడట. 2020 చివరి నాటికి అది పాజిబుల్ కావొచ్చని అంటున్నారు. కారణం ఏదైనా మొత్తానికి పూరి చెప్పిందే నిజమయ్యేట్టు ఉంది. ఇప్పట్లో పూరికి మహేష్ ఛాన్స్ ఇవ్వడమూ కష్టమే అని అర్థమవుతోంది.