టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు కెరీర్ లోనే అత్యంత భారీ బడ్జెట్ లో తెరకెక్కిన స్పైడర్ చిత్రం ఫైనల్ గా డిజాస్టర్ అయ్యింది. అంతే కాకుండా చిత్ర నిర్మాతకు అలాగే బ్బయ్యర్స్ కి కూడా సినిమా చాలా నిరాశనే మిగిల్చింది. అయితే ఆ సినిమా ప్రభావం నెక్స్ట్ సినిమా పడుతుందా అనే ఊహాగానాలు అందరిలో మొదలయ్యాయి. కానీ ప్రస్తుత పరిస్థితులను చూస్తుంటే అలా అనిపించడం లేదు.
ప్రస్తుతం మహేష్ కొరటాల శివ దర్శకత్వంలో భరత్ అనే నేను సినిమాను చేస్తున్నాడు. శ్రీమంతుడు తరువాత ఈ కాంబో రిపీట్ అవుతుండడంతో మొదట భారీ అంచనాలు ఉన్నా.. ఆ తర్వాత స్పైడర్ ఫెయిల్యూర్ తో ఆ సినిమా మార్కెట్ పై కొంత ఎఫెక్ట్ పడనుందని కామెంట్స్ వినిపించాయి. కానీ భారత్ అనే నేను సినిమా కమర్షియల్ సినిమా కావడంతో అందరికి నచ్చుతుందని ముఖ్యంగా మహేష్ అభిమానులకు బాగా నచ్చుతుందని బయ్యర్స్ ముందే నిర్మాతకి అడ్వాన్స్ లు ఇచ్చేస్తున్నారట. స్పైడర్ కి దాదాపు 120 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది.
ఇప్పుడు భరత్ అనే నేను సినిమా కి కూడా అదే స్థాయిలో బిజినెస్ జరగనుందని సమాచారం. ఈ సినిమాలో మహేష్ ముఖ్యమంత్రి పాత్రలో కనిపిస్తుండడం తో పాటు మంచి సోషల్ ఎలిమెంట్ కూడా ఉంటుందని దర్శకుడు చెబుతుండడంతో ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. ప్రస్తుతం ఆ సినిమా షూటంగ్ శరవేగంగా జరుపుకుంటోంది. దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాను డివివి దానయ్య నిర్మిస్తున్నారు