మహేశ్ సినిమాకు 100 కోట్ల పెట్టుబడి

Update: 2016-06-17 11:46 GMT
మహేశ్ బాబు సినిమా అంటే ఒక రేంజిలో అంచనాలుంటాయి.. మరి మహేశ్ సినిమాకు మురుగదాస్ వంటి టాప్ డైరెక్టర్ పనిచేస్తున్నారంటే అంచనాలు ఇంకా పెరిగిపోతాయి. వీటికి తోడు భారీ బడ్జెట్ సినిమా.. ఇంకేముందు ఇండస్ర్టీలో అందరి నోటా ఇదే మాట. భారీ అంచనాలతో వస్తున్న ఈ సినిమా ఇంకా ప్రారంభమే కాలేదు కానీ ఊహాగానాలు మాత్రం కోట్లు దాటుతున్నాయి.  సుమారు 100 కోట్ల బడ్జెట్ సినిమా అని అందరూ చర్చించుకుంటున్నారు. దీంతో ఈ భారీ బడ్జెట్ సినిమా నిర్మాణానికి బడాబడా సంస్థలు పెట్టుబడి పెడుతున్నట్లు తెలుస్తోంది.

భారీ బడ్జెట్  సినిమాని నిర్మించటం అంటే బడా నిర్మాతలకూ భారమే. ఏమాత్రం తేడా కొట్టినా పతనమే. హిట్టయితే ఎంతగా లాభాలు ఆర్జించవచ్చో.. తేడా వస్తే అంతకంటే ఎక్కువ నష్టపోవాల్సి ఉంటుంది. అందుకే ఎవరూ కూడా ఒక్కరుగా దీనికి బడ్జెట్ పెట్టడానికి ముందుకురాలేదట.  ఈ సినిమా నిర్మాణంలో బడా సంస్థలు పాలుపంచుకుంటున్నాయట.  ప్ర‌ధాన నిర్మాత ఎన్‌ వి.ప్ర‌సాద్‌ కాగా  రిల‌య‌న్స్ ఎంట‌ర్‌ టైన్‌ మెంట్‌ లియో ప్రొడ‌క్ష‌న్‌ - మెగా సూప‌ర్‌ గుడ్ ఫిల్మ్స్ సంస్థ‌లు సంయుక్తంగా ఈ సినిమాను స‌మ‌ర్పిస్తున్నాయి.

అంతేకాదు..  మురుగ‌దాస్‌ తో ఉన్న ఒప్పందం ప్ర‌కారం ఫాక్సు స్టార్ స్టూడియోస్‌ - మ‌హేష్ సొంత బ్యాన‌ర్ అయిన ఎంబీ ఎంట‌ర్‌ టైన్‌ మెంట్ సంస్థ‌లు కూడా ఈ సినిమా నిర్మాణంలో పాలు పంచుకుంటున్నాయ‌ట‌. అంటే మొత్తం ఆరు నిర్మాణ సంస్థలు పాలు పంచుకున్న‌ట్టు స్ప‌ష్ట‌మ‌వుతోంది. ఓ బ‌లమైన సామాజిక నేప‌థ్యం ఉన్న స్టోరీతో తెర‌కెక్కుతున్న ఈ సినిమాలో మ‌హేష్ స‌ర‌స‌న బాలీవుడ్ బ్యూటీ ప‌రిణితి చోప్రా హీరోయిన్‌ గా న‌టిస్తోంది. హ‌రీష్‌ జైరాజ్‌ సంగీతం.. సంతోష్‌ శివ‌న్ కెమేరా సినిమాకు ప్లస్ పాయింట్లవుతాయని భావిస్తున్నారు.
Tags:    

Similar News