మురుగదాస్ దర్శకత్వంలో మహేష్ సినిమా కన్ఫమ్ అయి చాలా కాలమైంది. షూటింగ్ మొదలైంది పది నెలల కిందటే అయినా.. అంతకు ఏడాది ముందే ఈ సినిమా ఓకే అయింది. ఆ టైంలో తమిళ హిట్ మూవీ ‘మౌనగురు’ను హిందీలో ‘అకీరా’ పేరుతో రీమేక్ చేసే పనిలో ఉన్నాడు మురుగదాస్. రీమేక్ కాబట్టి దాని విషయంలో మురుగదాస్ అంత శ్రమ పడాల్సిన అవసరం కూడా లేకపోయింది.
మహేష్ సినిమా స్క్రిప్టు మీదే చాలా సమయం వెచ్చించినట్లుగా చెప్పుకున్నారు. మహేష్ కూడా ‘బ్రహ్మోత్సవం’ పని ముగించి రావడానికి లేటవడంతో మురుగదాస్ సినిమా మొదలవడానికి ఆలస్యమైంది. ఐతే కావాల్సినంత టైం తీసుకుని.. ఏమాత్రం రాజీ పడకుండా ప్రి ప్రొడక్షన్ చేసినా.. పక్కా ప్లాన్ తో రెగ్యులర్ షూటింగ్ మొదలుపెట్టినా.. ఈ సినిమా ఇంత ఆలస్యం అవుతుండటమే ఆశ్చర్యం కలిగించే విషయమే.
మధ్యలో షెడ్యూళ్లు ఆలస్యం కావడం వల్లో.. స్క్రిప్టులో మార్పుల వల్ల రీషూట్లు చేయాల్సి వచ్చో సినిమా ఒకట్రెండు నెలలు వాయిదా పడటాన్ని అర్థం చేసుకోవచ్చు. కానీ ముందు అనుకున్న ప్రకారం జనవరి కల్లా పూర్తి కావాల్సిన సినిమా.. ఇప్పటికీ పూర్తి కాలేదంటే.. ఇంకో రెండు మూడు నెలలకు కూడా రెడీ కావడం సందేహమే అంటే అభిమానులు ఫ్రస్టేటవడంలో తప్పేం లేదు. ఇప్పటికే ఈ సినిమాను వాయిదాల మీద వాయిదాలు వేశారు. మేతో మొదలుపెట్టి ఒక్కో నెల వెనక్కి జరుపుకుంటూ వెళ్లారు.
చివరికి ఆగస్టు 11న పక్కా అనుకుంటే ఇప్పుడు ఆ డేటూ కష్టమే అంటున్నారు. దసరాకు కూడా గ్యారెంటీ లేదని వార్తలొస్తున్నాయి. ఇది మహేష్ అభిమానులకే కాదు.. సామాన్య ప్రేక్షకుల్ని కూడా అసహనానికి గురి చేస్తోంది. మరి సినిమా మొదలవడానికి ముందు ప్రి ప్రొడక్షన్ కోసం అంత టైం తీసుకుని.. అంత ప్లాన్ చేసి.. సినిమాను పూర్తి చేయడానికి ఇంత ఇబ్బంది పడిపోతుండటం ఏంటో అర్థం కావడం లేదు. ప్లానింగ్ లో తిరుగులేదని పేరున్న మురుగదాస్.. మహేష్ కాంబినేషన్లో తెరకెక్కుతున్న సినిమాకు ఇలా అవుతుండటం ఆశ్చర్యం కలిగించే విషయమే.