ఇక మీదట సొంతంగానే ప్రిన్స్‌ ప్రొడక్షన్‌

Update: 2015-08-10 15:40 GMT
ఒక ఫార్ములా వర్కవుటైతే సేమ్‌ రిపీట్‌ చేయడం మనవాళ్లకు కొత్తేమీ కాదు. ఏం చేసినా హిట్టు కొట్టడమే అంతిమ లక్ష్యం. వర్కవుటైన ఫార్ములాని పదే పదే ఉపయోగిస్తే తప్పేం లేదనే అనుకుంటారు. అదే బాటలో ఇప్పుడు మహేష్‌ కూడా ఫార్ములాని రిపీట్‌ చేస్తున్నాడు. అతడు మొదటిసారి కో ప్రొడ్యూసర్‌ గా శ్రీమంతుడుకి పెట్టుబడులు సమకూర్చాడు. పారితోషికాన్నే పెట్టుబడిగా పెట్టి లాభాల్ని ఆర్జించాడు. అందుకే ఆ సక్సెస్‌ ఇచ్చిన కిక్కుతో ఇప్పుడు సొంతంగానే ప్రొడక్షన్‌ ని నడిపించేసేందుకు ప్లాన్‌ చేస్తున్నాడట.

మహేష్‌ కథానాయకుడిగా శ్రీకాంత్‌ అడ్డాల దర్శకత్వంలో బ్రహ్మూెత్సవం తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. జూలైలోనే ఈ సినిమా రెగ్యులర్‌ షూటింగుకి వెళ్లాల్సింది. కానీ ఆలస్యమైంది. శ్రీమంతుడు కూల్‌ గా రిలీజైపోయింది కాబట్టి ఇక త్వరలోనే ఈ చిత్రాన్ని ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఈసారి ప్రిన్స్‌ ప్లాన్‌ మార్చి ఈ చిత్రానికి సంబంధించినంతవరకూ ప్రతిదీ దగ్గరుండి చూసుకోవాలనుకుంటున్నాడట. కాస్టింగ్‌ ఎంపికల నుంచి ప్రమోషన్‌ వరకూ తనే బాధ్యత వహిస్తున్నాడు. పివిపి తో కలిసి చిత్రానికి పెట్టుబడులు పెడుతున్నాడు.

ఈసారీ శ్రీమంతుడుతో వర్కవుటైన ఫార్ములాని తిరిగి బ్రహ్మూెత్సవానికి అప్లయ్‌ చేస్తున్నాడట. ఓ వైపు ప్రొడక్షన్‌ లో ఏం జరుగుతుందో తెలిసిపోతుంది. మరోవైపు సొంత బ్యానర్‌ డెవలప్‌ అవుతుంది. ఒకే దెబ్బకు రెండు పిట్టలు. అదీ ప్రిన్స్‌ ప్లాన్‌!
Tags:    

Similar News