మహేష్‌ సేంద్రీయ వ్యవసాయం..!

Update: 2018-11-01 13:11 GMT
సూపర్‌ స్టార్‌ మహేష్‌ బాబు ప్రస్తుతం తన 25వ చిత్రం ‘మహర్షి’ లో నటిస్తున్న విషయం తెల్సిందే. చాలా ప్రతిష్టాత్మకంగా వంశీ పైడిపల్లి దర్శకత్వంలో దిల్‌రాజు ` అశ్వినీదత్‌ ` పీవీపీ లు నిర్మిస్తున్న ఈ చిత్రంలో మహేష్‌ బాబు పలు గెటప్స్‌ లో కనిపిస్తాడంటూ మొదటి నుండి వార్తలు వస్తున్నాయి. అందులో ఒకటి రైతు పాత్ర. మహేష్‌ బాబు రైతు పాత్ర ఏంటో అంటూ అంతా ఆశ్చర్యం వ్యక్తం చేశారు. మహర్షి ఫస్ట్‌ లుక్‌, ఆ తర్వాత లుక్‌ లీక్‌ లుక్‌ లను బట్టి చూస్తుంటే కాలేజ్‌ స్టూడెంట్‌ గా, ఫారిన్‌ బిజినెస్‌ మన్‌ గా కనిపిస్తాడని - రైతు గా కనిపించబోతున్నాడు అంటూ వచ్చిన వార్తలు పుకార్లే అని అంతా అనుకున్నారు. కాని తాజాగా రైతుగా ఈ చిత్రంలో మహేష్‌ కనిపిస్తాడని మరోసారి వార్తలు గుప్పుమంటున్నాయి.

ఫారిన్‌ నుండి స్నేహితుడి కోసం ఒక పల్లెటూరుకు వచ్చే మహర్షి అక్కడ ఊర్లో రైతులు పడుతున్న ఇబ్బందులను చూసి వారికి సేంద్రీయ పద్దతిలో వ్యవసాయం, సేంద్రీయ పంట వల్ల లాభాలు చెప్తాడట. వారికి సేంద్రీయ వ్యవసాయంలో ట్రైనింగ్‌ కూడా ఇచ్చే సీన్స్‌ సినిమాలో ఉంటాయని సమాచారం అందుతుంది. శ్రీమంతుడు సినిమాలో ఒక పల్లెటూరుకు వెళ్లి అక్కడ ఎలా అయితే కష్టపడతాడో ఈ చిత్రంలో కూడా పల్లెటూరులో స్నేహితుడి కోసం కష్టపడతాడంటూ సినీ వర్గాల నుండి తెలుస్తోంది.

మొన్నటి వరకు అమెరికాలో చిత్రీకరణ జరుపుకుని తాజాగా హైదరాబాద్‌ చేరుకున్న చిత్ర యూనిట్‌ సభ్యులు త్వరలోనే హైదరాబాద్‌ శివారులో వేస్తున్న పల్లెటూరు సెట్‌ లో చిత్రీకరణలో పాల్గొనేందుకు సిద్దం అవుతున్నాడు. ఈ షెడ్యూల్‌ లోనే మహేష్‌ బాబు రైతుగా మారబోతున్నాడు, సేంద్రీయ వ్యవసాయం చేయబోతున్నాడు అంటూ సినీ వర్గాల నుండి సమాచారం అందుతుంది. మహర్షి చిత్రంలో గడ్డంతో - మీసాలతో - క్లీన్‌ షేవ్‌ తో ఇలా రకరకాలుగా మహేష్‌ బాబు కనిపించబోతున్నాడు.

మహేష్‌ బాబుకు జోడీగా ఈ చిత్రంలో పూజా హెగ్డే నటిస్తున్న విషయం తెల్సిందే. ఇక ఈ చిత్రంలో మహేష్‌ బాబుకు స్నేహితుడిగా అల్లరి నరేష్‌ నటించబోతున్నాడు. ఈ చిత్రంలో అల్లరి నరేష్‌ పాత్ర చాలా కీలంగా ఉంటుందని మొదటి నుండి ప్రచారం జరుగుతుంది. వచ్చే సమ్మర్‌ లో సినిమాను విడుదల చేసేందుకు వంశీ పక్కా ప్రణాళికతో సినిమా షూటింగ్‌ జరుపుతున్నాడు.

Tags:    

Similar News