మహేష్ ముందు రజినీ దిగదుడుపే

Update: 2016-07-18 09:30 GMT
సౌత్ ఇండియాలో రజినీకాంత్‌ ను మించిన స్టార్ ఉన్నాడా..? క్రేజ్.. బాక్సాఫీస్ స్టామినా విషయంలో ఆయన ముందు ఎవ్వరూ నిలువజాలరు. కొన్ని విషయాల్లో బాలీవుడ్ సూపర్ స్టార్లు కూడా ఆయన ముందు దిగదుడుపే. ఐతే చాలా విషయాల్లో రజినీకాంత్ డామినేషన్ ఉన్న మాట వాస్తవమే కానీ.. ఒక్క అమెరికా మార్కెట్ విషయంలో మాత్రం తెలుగు హీరోలదే పైచేయి. మన స్టార్ హీరోల సినిమాల హక్కులు అక్కడ రూ.10 కోట్లకు తక్కువ కాకుండా పలుకుతున్నాయి. ముఖ్యంగా మహేష్ బాబు సినిమా అంటే డిమాండ్ మామూలుగా ఉండదు.

మొన్న ‘బ్రహ్మోత్సవం’ సినిమా అమెరికా-కెనడా హక్కుల్ని రూ.13.5 కోట్లకు కొన్నాడు బయ్యర్. ఆ సినిమా ఫలితం ఎలా ఉన్నప్పటికీ మహేష్ బాబు తర్వాతి సినిమాకు కూడా అదే రేటు పలికే అవకాశముంది. ఐతే రజినీకాంత్ సినిమా ‘కబాలి’ అమెరికా-కెనడా హక్కులు రూ.8.5 కోట్లు మాత్రమే పలకడం విశేషం. రజినీ అనే కాదు.. అసలు తమిళ హీరోలెవ్వరికీ కూడా అమెరికాలో పెద్దగా మార్కెట్ లేదు. ఇప్పుడిప్పుడే అక్కడ తమిళ సినిమాలు ఉనికి చాటుకుంటున్నాయి. 24.. తెరి లాంటి సినిమాలు పర్వాలేదనిపించాయి. వాటిలో సమంత హీరోయిన్ కావడం కూడా ఒక కారణం. రజినీకి విదేశాల్లో మంచి ఫాలోయింగే ఉంది కానీ.. అమెరికాలో మన హీరోలకు రజినీ కంటే ఎక్కువ డిమాండ్ ఉంది.
Tags:    

Similar News