'మేజర్' వెనకున్న సూపర్ పవర్ మహేశ్ గారే!

Update: 2022-05-09 14:53 GMT
అడివి శేష్ హీరోగా 'మేజర్' సినిమా రూపొందింది. మహేశ్ బాబు నిర్మించిన ఈ సినిమాకి, శశి కిరణ్ తిక్క దర్శకత్వం వహించాడు.  26/11 ముంబైలోని హోటల్ పై జరిగిన ఉగ్రదాడి నేపథ్యంలో నడిచే కథ ఇది. మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ జీవితచరిత్రగా ఈ సినిమా నిర్మితమైంది. అడివి శేష్ సరసన నాయికలుగా సయీ మంజ్రేకర్  - శోభిత  ధూళిపాళ అలరించనున్నారు. ఈ సినిమాకి శ్రీ చరణ్ పాకాల సంగీతాన్ని సమకూర్చాడు. కొంతసేపటి క్రితం ఈ సినిమా నుంచి మహేశ్ బాబు ట్రైలర్ ను రిలీజ్ చేశారు.

ఈ వేదికపై దర్శకుడు శశి కిరణ్ తిక్క మాట్లాడుతూ .. "అడివి శేష్ తో  నేను చేసిన రెండో సినిమా ఇది. 2018లో మా 'గూఢచారి' సినిమా వచ్చింది.  ఆ వెంటనే ' మేజర్'  చేద్దామని అడివి శేష్ చెప్పాడు. అప్పటికి నేను వేరే ప్రాజెక్టు ఆలోచనలో ఉన్నాను. కానీ మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్  గారు గురించి శేష్ చెప్పగానే, ఆయన గురించి నేను కూడా  రీసెర్చ్ చేయడం మొదలుపెట్టాను. ఈ స్టోరీ చెప్పకపోతే తప్పవుతుందని  అనిపించింది. దాంతో నేను ఈ సినిమా చేయడానికి వచ్చాను.

ఈ సినిమా కోసం మా టెక్నీషియన్స్ అంతా కూడా ఎంతో కష్టపడ్డారు. ఆర్టిస్టుల గురించి చెప్పాలంటే, సయీ చాలా వండర్ఫుల్ ఆర్టిస్ట్ .. అలాగే  శోభిత కూడా. ప్రకాశ్ రాజ్ గారు .. రేవతి గారి గురించి కొత్తగా నేనేమీ చెప్పనవసరం లేదు. ఈ సినిమా కోసం నేను సందీప్ ఉన్నికృష్ణన్ పేరెంట్స్ ను కలిశాను. వాళ్లతో మాట్లాడుతున్నప్పుడు నాకు ఎలాంటి  ఫీల్ కలిగిందో, షూటింగు సమయంలో మానిటర్ చూస్తున్నప్పుడు కూడా అలాగే కళ్ల వెంట నీళ్లొచ్చాయి. రెండు సందర్భాల్లోను ఒకే రకమైన అనుభూతి కలగడం విశేషం.

 జరిగిన సంఘటనను గురించి నేను వింటూ  ఎలా ఫీల్ అయ్యానో .. నా ద్వారా మహేశ్ సార్ .. మేడమ్ వింటూ అదే ఫీలయ్యారు. అదే ఫీల్ ను  స్క్రీన్ ద్వారా ఆడియన్స్ పొందుతారని భావిస్తున్నాను. శేష్ గురించి చెప్పాలంటే నేను చాలా చెప్పచ్చు. ఆయన గురించి ఒక బుక్ రాయవచ్చు. ఆ బుక్ ను నా కంటే మంచిగా ఎవరూ రాయలేరు. శేష్ తో పోటీపడితే టాప్ కి వెళ్లిపోతాం అనే విషయం నాకు అర్థమైంది .. తనతో పోటీపడాలంతే. మహేశ్ గారు ఈ సినిమా వెనుక ఉండటం వలన ఒక సూపర్ పవర్ ఉన్నట్టుగా అనిపించింది. ఆ ధైర్యంతోనే ముందుకు వెళ్లడం జరిగింది" అని చెప్పుకొచ్చాడు.
Tags:    

Similar News