ఒకప్పుడు పాలిటిక్స్ మీద సినిమా అంటే ఏ భారతీయుడు అనో ఒకే ఒక్కడు అనో కేవలం వెళ్ళ మీద లెక్కపెట్టేటన్ని సినిమాలు మాత్రమే ఉండేవి. కానీ ఇప్పుడు ట్రెండ్ మారింది. రాజకీయాల నేపథ్యంలో వచ్చే సినిమాలపై క్రేజ్ పెరిగింది. ఇప్పుడు మరీ ఆసక్తికరమైన విషయం ఏమిటయ్యా అంటే ఇద్దరు సూపర్ స్టార్లు ఒకేసారి పాలిటిక్స్ మీద సినిమాతో రాబోతున్నారు
అదేనండి మన టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు మరొకరు లేడీ సూపర్ స్టార్ నయనతార. తమిళంలో అరం అనే టైటిల్ తో రిలీజ్ అయ్యి పెద్ద హిట్ అయ్యింది ఆ సినిమా. ఇప్పుడు అదే సినిమాను తెలుగులో 'కర్తవ్యం'గా విడుదల చేయబోతున్నారు. మహేష్ బాబు కూడా భరత్ అనే నేను సినిమా తో రిలీజ్ కు సిద్ధంగా ఉన్నాడు. ఈ రెండూ రాజకీయ నేపథ్యంలో వచ్చే సినిమాలే కాగా వీటి మధ్య పెద్ద తేడాలు ఏమి లేవు. ఇద్దరూ ప్రజలకు సేవ చేయాలనే మనస్తత్వం కలవారే. మహేష్ బాబు ముఖ్యమంత్రి అయితే నయన్ జిల్లా కాలెక్టరుగా నటిస్తోంది అంతే. ఇది తప్ప పెద్ద బేధాలు ఏమి లేవు. మహేష్ సినిమా మొత్తం తను చేసిన వాగ్దానాలను నిలబెట్టుకోడానికి తపిస్తూ ఉంటే నయన్ ఏమో ప్రజలకు జరుగుతున్న అన్యాయాన్ని ఖండిస్తూ ఉంటుంది.
భరత్ అనే నేను ఏప్రిల్ 27 న మన ముందుకు రాబోతోంటే కర్తవ్యం మార్చ్ 16నే విడుదల అవ్వబోతోంది. అయితే ఒకటే టైములో ఇటువంటి పొలిటికల్ డ్రామాలు రావడం ఒకెత్తయితే.. అసలు తెలుగు రాష్ట్రాలలో ఇదే సమయంలో రాజకీయం వేడెక్కిపోవడం మరో ఎత్తు. ఆల్రెడీ స్పెషల్ స్టాటస్ అని.. నదులు అనుసంధానం అంటూ ఆంధ్ర అండ్ తెలంగాణ రగులుతున్నాయి. ఈ టైములో ఈ పొలిటికల్ డ్రామాలు ఎట్లుంటాయో చూడాలిమల్లా!!