టాలీవుడ్ స్టార్లు ఇరుగు పొరుగు భాషల్లో ఎంట్రీ ఇచ్చేందుకు ఆసక్తి కనబరుస్తున్నారు. అయితే బాలీవుడ్ కి వెళ్లాలన్నది మాత్రం అందరికీ సాధ్యం కానిది. మెజారిటీ పార్ట్ ఫెయిల్యూర్ ఎదురవుతోంది. అయితే ఇప్పుడున్న స్టార్లలో మహేష్.. ప్రభాస్ లాంటి స్టార్లకు బాలీవుడ్ ప్రవేశం కష్టమైన పనేం కాదు. బాహుబలి సిరీస్ తర్వాత ప్రభాస్ కి బాలీవుడ్ ... టాలీవుడ్ అన్న తేడా లేదు. అతడు నటిస్తున్న సాహో హిందీ ఆడియెన్ సహా యూనివర్శల్ ఆడియెన్ ని దృష్టిలో ఉంచుకుని రూపొందించినది. ఈ భారీ యాక్షన్ సినిమా తర్వాత ప్రభాస్ రేంజు బాలీవుడ్ లోనూ ఓ లెవల్లో వెలిగిపోతుందనడంలో సందేహమే లేదు.
ఇప్పటికే సాహో మేకింగ్ విజువల్స్ కి ఉత్తరాది ఆడియెన్ నుంచి అద్భుత స్పందన వచ్చింది. బాలీవుడ్ క్రిటిక్స్ ప్రశంసలతో ముంచెత్తారు. అందుకే ప్రభాస్ బాటలోనే మహేష్ కూడా బాలీవుడ్ వెళ్లే ఛాన్సుందా? అంటూ ఆసక్తికర చర్చ సాగుతోంది. వాస్తవానికి బాలీవుడ్ లో నటించాల్సిందిగా పలువురు దర్శకనిర్మాతలు మహేష్ వెంట పడుతూనే ఉన్నారు. కానీ అతడు ప్రతిసారీ టాలీవుడ్ కే ప్రాధాన్యతనిస్తూ బాలీవుడ్ కి వెళ్లనని చెప్పేస్తున్నారు.
ప్రతిసారీ మీడియా ఆ ప్రశ్న అడుగుతున్నా.. ఇప్పటికి టాలీవుడ్ వరకేనని జవాబిస్తూనే ఉన్నారు. మరోసారి బాలీవుడ్ మీడియా అడిగిన ప్రశ్నకు తాజాగా మహేష్ అదే సమాధానం ఇచ్చారు. ప్రస్తుతానికి నా ప్లేట్ అస్సలు ఖాళీ లేదు. బాలీవుడ్ ఎంట్రీ గురించి ఇప్పుడే చెప్పలేను! అంటూ సమాధానం దాట వేశారు. అంటే సౌత్ లో కెరీర్ పరంగా బిజీగా ఉన్నానని ఇప్పట్లో బాలీవుడ్ కి వెళ్లేది లేదని తేల్చి చెప్పేశారు. మహేష్ హీరోగా కెరీర్ 26వ సినిమా సరిలేరు నీకెవ్వరు సెట్స్ కెళుతోంది. జూలైలో మహేష్ షూటింగ్ లో జాయిన్ అవుతున్నారు. తదుపరి ముగ్గురు దర్శకులు క్యూలో ఉన్నారు. అగ్ర నిర్మాణ సంస్థలు మహేష్ తో సినిమా కోసం వేచి చూస్తున్నాయి. అందుకే తన ప్లేట్ ఖాళీ లేదని ఛమత్కరించారన్నమాట.