గతంలో మనం చెప్పుకున్నట్లు.. ఈ మధ్య కాలంలో ప్రతీ సినిమా బిజినెస్ విషయంలోనూ.. పవన్ కళ్యాణ్ అండ్ మహేష్ బాబు మధ్యన పోటీ నెలకొని ఉంది. వారు వద్దని అనుకున్నా కూడా.. నెం.1 స్థానం కోసం వీరిరువురూ పోటీ పడుతూనే ఉన్నారు. ఇక మొన్ననే నైజాం ఏరియలో పవన్ ''సర్దార్'' కంటే మహేష్ ''బ్రహ్మోత్సవం'' ఎక్కువ రేటు పలికిందని చెప్పుకున్నాం కూడా. ఇప్పుడు శాటిలైట్ రైట్స్ వరకు వచ్చేసరికి ఈ సీన్ రివర్స్ అయ్యింది.
పవన్ కళ్యాన్ ''సర్దార్''ను మా టివి అప్పట్లో 13-14 కోట్ల మధ్యన ఒక ఫిగర్ కు తెగ్గొట్టింది. సినిమాకు ఉన్న క్రేజ్.. పవన్ రికాల్ వాల్యూ.. మొదలగు విషయాలన్నీ మైండ్ లో ఉంచుకొని అంత చెల్లించారట. ఇప్పుడు బ్రహ్మోత్సవం శాటిలైట్ రేట్లు అమ్మే టైమొచ్చింది. అయితే అప్పట్లో 20 కోట్లకు ఒక ప్రముఖ ఛానల్ రైట్స్ అడిగింది కాని.. ఆ డీల్ వర్కవుట్ కాలేదు. చివరకు జీ తెలుగు వారు ఈ సినిమాను 11.20 కోట్లకు కొన్నట్లు తెలుస్తోంది. అంటే ఇక్కడ మహేష్ కంటే పవన్ ఎక్కువగా కొట్టేశాడనమాట.
సర్లేండి.. ఇంతేసి మొత్తంలో శాటిలైట్ రేట్లు ఇస్తున్నప్పుడు.. సినిమాలు కూడా సూపర్ హిట్ అవ్వాలి. అప్పుడే టివి వారికి టివిల్లో సినిమా వేసినప్పుడు ఆడియన్స్ ఎక్కువ సంఖ్యంలో ఉంటారు. సర్దార్ డిజప్పాయింట్ చేసింది మరి.. వాట్ ఎబౌట్ బ్రహ్మోత్సవం?? మరో నాలుగు రోజులు ఆగాల్సిందే.