మహేష్ డౌట్: ‘ఘాజీ’ ఎందులో చూడాలి?

Update: 2017-02-21 06:00 GMT
గత శుక్రవారం విడుదలైన ‘ఘాజీ’ని టాలీవుడ్ సెలబ్రెటీలందరూ నెత్తిన పెట్టుకున్నారు. ఈ సినిమాపై ప్రశంసల జల్లు కురిపించారు. మన ఇండస్ట్రీ నుంచి ఒక సినిమాకు ఈ స్థాయిలో రెస్పాన్స్ రావడం ఈ మధ్య కాలంలో ఎప్పుడూ జరగలేదు. సూపర్ స్టార్ మహేష్ బాబు సైతం ఈ సినిమా మీద చాలా ఆసక్తి చూపించాడట. మహేష్ తో ‘శ్రీమంతుడు’ చేసిన మదీనే ‘ఘాజీ’కి కూడా ఛాయాగ్రహణం అందించిన సంగతి తెలిసిందే. మహేష్ అతడికే ఫోన్ చేసి అభినందనలు తెలపడంతో పాటు ఈ సినిమాను ఏ భాషలో చూస్తే బెటర్ అని కూడా అడిగాడట.

‘‘మహేష్ ఫోన్ చేసి కంగ్రాట్స్ చెప్పారు. ఈ సినిమాను ఏ భాషలో చూస్తే ఫీల్ బాగుంటుంది అని దాపరికం లేకుండా అడిగారు. ఇది బేసిగ్గా తెలుగులో తెరకెక్కిన సినిమా.. పైగా తెలుగులో ఇలాంటి ప్రయత్నం జరగడం ఇదే తొలిసారి కాబట్టి తెలుగులోనే చూడమని చెప్పాను’’ అని మదీ తెలిపాడు. తన కెరీర్లో అత్యంత కష్టపడి పని చేసిన సినిమాల్లో ‘ఘాజీ’ ఒకటని చెప్పిన మదీ.. ఇప్పుడు దీనికి వస్తున్న రెస్పాన్స్ చూస్తుంటే పడ్డ కష్టమంతా మరిచిపోతున్నానన్నాడు.

తన ఫ్యూచర్ ప్రాజెక్టుల గురించి మదీ చెబుతూ.. ‘‘ప్రభాస్-సుజీత్ సినిమా చేయబోతున్నా. ఎప్పుడెప్పుడు ఈ సినిమా మొదలుపెడతానా అనిపిస్తోంది. అది భారీ సినిమా మూడు భాషల్లో తెరకెక్కనుంది. డిఫరెంట్ లొకేషన్లలో భారీగా తీయాల్సి ఉంది’’ అని అన్నాడు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News