సూపర్ స్టార్ మదర్ సెంటిమెంట్

Update: 2019-05-12 11:25 GMT
సూపర్ స్టార్ మహేష్ నటించిన మహర్షి ఇటీవలే రిలీజై మిశ్రమ స్పందనలు అందుకున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా మహేష్ కెరీర్ లో క్లాసిక్ సినిమా.. తన కెరీర్ బెస్ట్ కాబోతోంది అంటూ చిత్రయూనిట్ ప్రచారం సాగిస్తోంది. బాక్సాఫీస్ వద్ద తొలి వీకెండ్ రికార్డుల గురించి.. దిల్ రాజు టీమ్ ప్రచారార్భాటం గురించి తెలిసిందే. ఈ సినిమా తొలి వారాంతానికి చక్కని వసూళ్లు సాధిస్తుందని టీమ్ విశ్లేషిస్తోంది. అయితే మహర్షి వసూళ్ల సంగతి అటుంచితే.. ఈ సినిమా ప్రచార కార్యక్రమంలో మహేష్ ఎమోషన్ అయిన తీరు ప్రముఖంగా చర్చకు వచ్చింది.

నేడు హైదరాబాద్ నోవాటెల్ లో జరిగిన విజయోత్సవ వేదికపై మహేష్ తన మాతృమూర్తిని తలచుకుని ఎంతో ఎమోషన్ కి గురయ్యారు. మహేష్ మాట్లాడుతూ అమ్మ గురించి తలచుకున్న విధానం అహూతుల గుండెల్ని టచ్ చేసింది. ఇవాళ చాలా స్పెషల్ డే..  మదర్స్ డే .. నాకు అమ్మంటే దేవుడితో సమానం.. నేను ఎప్పుడు సినిమా రిలీజ్ ముందు ఆవిడ ఇంటికి వెళ్లి కాఫీ తాగుతాను. అలా కాఫీ తాగడం అంటే దేవుడి గుడికి వెళ్లి ప్రసాదం తిన్నట్టు... అంటూ ఎమోషన్ అయ్యారు. అమ్మ గురించి మాట్లాడేప్పుడు మహేష్ ఎమోషన్ అయిన తీరు అహూతుల హృదయాన్ని టచ్ చేసింది.

ఇక మహేష్ కి అమ్మంటే ఎంత ఇష్టమో కేవలం మహర్షి వేదికపైనే కాదు.. ఎన్నో సందర్భాల్లో ఆయన చెప్పకనే చెప్పారు. అయితే నేడు మదర్స్ డే సందర్భంగా ప్రత్యేకించి అమ్మ గురించి ప్రస్థావించి ఎంత పెద్ద సూపర్ స్టార్ అయినా ఒక అమ్మకు బిడ్డే కదా.. అనిపించారు. అదొక్కటే కాదు.. అతడు వేదికనెక్కగానే ముందుగా తనతో కలిసి నటించిన ఆర్టిస్టులందరి గురించి చెప్పిన మాటా ఆశ్చర్యపరిచింది. ఇంతవరకూ ఏ ఇతర సూపర్ స్టార్ చెప్పని విధంగా అతడు .. నా ఫేవరెట్ నటులంతా వేదికపై ఉన్నారు అంటూ ప్రస్థావించారు. పోసాని.. నరేష్.. లాంటి స్టార్ల గురించి గొప్పగా పొగిడేశారు మహేష్. ఆ ఇద్దరికీ థాంక్స్ కూడా చెప్పారు. అందునా అల్లరి నరేష్ గారు.. నరేష్ సర్ అంటూ ఎంతో గౌరవంగా పిలవడం మీడియాలోనూ చర్చకు వచ్చింది. అంతేకాదు.. టెక్నీషియన్ల కష్టం గురించి మహేష్ అంతే ఇదిగా మాట్లాడారు. నా కెరియర్ బ్లాక్ బస్టర్లన్నిటినీ వారం రోజుల్లోనే ఈ సినిమా అధిగమించేస్తోంది అంటూ ఆనందం వ్యక్తం చేశారు. మహర్షి చిత్రం 30 కోట్లు వసూలు చేసిన సంగతి తెలిసిందే. దాదాపు 100 కోట్లు వసూలు చేస్తేనే ఈ సినిమా ఆశించిన ఫలితాన్ని అందించినట్టు.


Tags:    

Similar News