ఇంకే తెలుగు సినిమా అందుకోలేని.. కనీసం ఊహించలేని రికార్డుల్ని నెలకొల్పింది బాహుబలి. అలాంటి బ్లాక్ బస్టర్ తర్వాత వచ్చిన పెద్ద సినిమా ‘శ్రీమంతుడు’. బాహుబలి హ్యాంగోవర్లో ఉన్న జనాలు ఈ సినిమాను ఎలా ఆదరిస్తారో అన్న టెన్షన్ మహేష్ సహా యూనిట్ సభ్యులందరిలో కనిపించింది. ఐతే మహేష్ సహా అందరి టెన్షన్ తీర్చేసేలా ‘శ్రీమంతుడు’ అనూహ్యమైన వసూళ్లు సాధించింది.
ఏకంగా వంద కోట్ల షేర్ కలెక్ట్ చేసి నాన్-బాహుబలి రికార్డులన్నీ చెదరగొట్టేసింది శ్రీమంతుడు. వారం రెండు వారాలకు ప్యాకప్ చెప్పేయకుండా 50 రోజుల వరకు జోరు కొనసాగించడం విశేషం. ఐతే ఎంత జోరు చూపించినా ఏ పాతికో యాభై కేంద్రాల్లో అర్ధ శత దినోత్సవం జరుపుకుని ఉంటుందని అనుకున్నారంతా. కానీ ఆ సినిమా ఏకంగా 187 కేంద్రాల్లో ఫిఫ్టీ కొట్టడం విశేషం. ఈ రోజుల్లో 50 కేంద్రాల్లో 50 ఆడినా విశేషమే. అలాంటిది 187 కేంద్రాల్లో అంటే మాటలు కాదు.
అంత పెద్ద హిట్టయి.. 600 కోట్ల క్లబ్ లో చేరిన బాహుబలి సైతం వంద సెంటర్లలో కూడా 50 రోజులు ఆడలేదు. ఐతే ‘శ్రీమంతుడు’ వంద సెంటర్లకు పైగా డైరెక్టుగా 50 రోజులాడింది. మిగతా సెంటర్లలో షిఫ్టింగ్ లతో 50 రోజులాడిందీ సినిమా. ఈ రోజుల్లో ఇది ఊహకైనా అందని రికార్డు. అత్యధిక సెంటర్లలో 50, 100 రోజులు ఆడిన రికార్డులు మహేష్ పేరిటే ఉన్నాయి. ‘పోకిరి’ సినిమా సినిమా పదేళ్ల కిందట ఈ రికార్డులు నెలకొల్పింది. ఇప్పుడు మరోసారి ఎవరికీ సాధ్యం కాని రికార్డు అందుకుని తన బాక్సాఫీస్ స్టామినాను మరోసారి రుజువు చేసుకున్నాడు మహేష్.