ఫోటో స్టోరీ : లాక్‌ డౌన్‌ ను ఇలా గడుపుతున్న మహేష్‌

Update: 2020-04-03 11:50 GMT
సూపర్‌ స్టార్‌ మహేష్‌ బాబు సహజంగానే కుటుంబంతో ఎక్కువ సమయంను గడిపేందుకు ఆసక్తి చూపిస్తూ ఉంటాడు. సినిమా సినిమాకు గ్యాప్‌ తీసుకుని మరీ విదేశాలకు వెళ్లడం హాలీడేస్‌ ను ఎంజాయ్‌ చేయడం చేస్తూ ఉంటాడు. సోషల్‌ మీడియాలో ఈ మద్య ఫ్యామిలీతో ఉన్న ఫొటోలను తెగ షేర్‌ చేస్తూనే ఉన్నాడు. ప్రస్తుతం కరోనా కారణంగా దేశ వ్యాప్తంగా లాక్‌ డౌన్‌ అమలు అవుతున్న నేపథ్యంలో మహేష్‌ ఇళ్లు వదిలి బయటకు రావడం లేదు.

ఈసమయంను పూర్తిగా పిల్లలతో భార్య నమ్రతతో మహేష్‌ గడుపుతున్నాడు. తాజాగా నమ్రత ఈ ఫొటోను షేర్‌ చేసింది. సితారతో కలిసి మహేష్‌ బాబు టీవీ చూస్తున్న ఈ ఫొటోను పోస్ట్‌ చేసింది. మామూలుగానే సితారతో ఎక్కువ సమయం గడిపేందుకు ఇష్టపడతానంటూ చెప్పే మహేష్‌ బాబు ఇప్పుడు పూర్తిగా పాపతో ఈ టైంను ఫుల్‌ గా వినియోగించుకుని సితారతో ఎంజాయ్‌ చేస్తున్నట్లుగా ఉన్నాడు అంటూ నెటిజన్స్‌ కామెంట్స్‌ చేస్తున్నారు.

చాలా మంది హీరోలు కరోనా కారణంగా సినిమాల షూటింగ్స్‌ క్యాన్సిల్‌ చేసుకున్నారు. కాని మహేష్‌ బాబు ప్రస్తుతం చేస్తున్న సినిమాలు ఏమీ లేవు. ఈ లాక్‌ డౌన్‌ ఎత్తి వేసి హడావుడి అంతా తగ్గిన తర్వాత ఈయన తన 27వ చిత్రాన్ని పరశురామ్‌ దర్శకత్వంలో మొదలు పెట్టే అవకాశం ఉందని తెలుస్తోంది. ఆ సినిమాను 14 రీల్స్‌ ఇంకా మైత్రి మూవీ మేకర్స్‌ వారు నిర్మించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ లాక్‌ డౌన్‌.. కరోనా కారణంగా ఆ ప్రాజెక్ట్‌ ఏమైనా మార్పు వచ్చేనా లేదంటే క్యాన్సిల్‌ అయ్యేనా అనేది మాత్రం తెలియాల్సి ఉంది.
Tags:    

Similar News