మహేష్ పెద్ద హ్యాండిచ్చేశాడే!!

Update: 2016-10-31 17:30 GMT
ఈసారి దీపావళికి తెలుగు ఫిలిం ఇండస్ర్టీ పేల్చిన టపాసులన్నీ బాగానే పేలాయ్. మెగాస్టార్ చిరంజీవి 150వ సినిమా పోస్టర్లు.. బాలయ్య శాతకర్ణి కొత్త పోస్టర్.. గురు కొత్త పోస్టర్.. అలాగే మంచు మనోజ్ రెండు కొత్త సినిమాల పోస్టర్లు.. ఇక రామ్ చరణ్‌ ధృవ రొమాన్స్ పోస్టర్లు.. అన్నీ ఆడియన్స్ ను బాగానే ఆకట్టుకున్నాయి. అయితే ఈ క్రాకర్స్ మధ్యలో ఒక తారాజువ్వ మాత్రం మిస్సయ్యింది.

అవును.. సూపర్ స్టార్ మహేష్‌ బాబు కొత్త సినిమా ఫస్ట్ లుక్ దీపావళి సందర్భంగా రిలీజ్ అవుతుందనే బజ్ టాలీవుడ్ లో ఎప్పటినుండో వినిపించింది. కాని చివరకు మహేష్‌ మాత్రం హ్యాండిచ్చేశాడు. అసలు ఏ.ఆర్.మురుగుదాస్ డైరక్షన్లో రూపొందుతున్న సినిమా టైటిల్ లోగో అయినా దీపావళికి రిలీజ్ చేస్తారని అనుకున్నారు. ఇకపోతే అభిమన్యుడు.. లేదా ఏజెంట్ శివ.. అనే టైటిల్స్ లో ఏది ఫైనల్ అనే విషయం కూడా బయటకు చెప్పలేదింకా. అలాగే మనోళ్ళు ఫస్ట్ లుక్ గట్రా కూడా ఏమీ రిలీజ్ చేయలేదు.

ఇప్పటికే ఈ సినిమాలో మహేష్‌ ఎలా ఉండబోతున్నాడో అభిమానులు కొందరు లీక్ చేసిన లుక్ నుండి రివీల్ అయిపోయింది కాబట్టి.. ఫ్యాన్స్ కూడా ఓకే అన్నట్లు ఉన్నారు. లేదంటే మాత్రం దీపావళికి అసలు ఫస్ట్ లుక్ రానందుకు వీరు కూడా బాగా హర్టయ్యేవారు. ప్రస్తుతం మహేష్‌ ఈ సినిమాను నిర్వధికంగా షూట్ చేసే పనిలో ఉన్నాడు. అది సంగతి.


Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News