ఎవరో చేయాల్సిన సినిమా ఇంకెవరి చేతికో వెళ్తుంది. అలా వెళ్లిన సినిమా బాగా ఆడకుంటే హమ్మయ్య అనుకునే హీరోలు.. అదే సినిమాకు మంచి రిజల్ట్ వస్తే రిగ్రెట్ కావడం సహజం. ఐతే ఇంకా సినిమా విడుదల కాకముందే ఓ హీరో తాను వదులుకున్న సినిమా గురించి చింతించాల్సిన పరిస్థితి అరుదుగా వస్తుంది. ‘24’ సినిమా విషయంలో మహేష్ బాబు అలా ఫీలవుతున్నాడో లేదో కానీ.. ఆయన అభిమానులు మాత్రం బాగానే ఇబ్బంది పడుతున్నారు. ఇప్పటికే పోస్టర్లతో విపరీతమైన ఆసక్తి రేపిన ‘24’ ఇప్పుడు టీజర్ తో సెన్సేషన్ క్రియేట్ చేస్తోంది. నిన్న రిలీజైన నిమిషం నిడివి టీజర్ చూస్తే మతి పోవడం ఖాయం.
ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ ఉన్న ఈ సినిమాను మహేష్ బాబు చేసి ఉంటే ఎలా ఉండేదో ఒక్కసారి ఊహించుకుంటేనే మనసు పులకరించడం ఖాయం. సూర్య అద్భుతంగానే చేసినట్లున్నాడు కానీ.. అతడిలాంటి వైవిధ్యమైన సినిమాలు చేయడం కొత్తేం కాదు. కానీ మహేష్ ఈ తరహా సినిమా చేసి ఉంటే ఆ ఫీలింగే వేరుగా ఉండేది. మూడు వైవిధ్యమన పాత్రలు.. వాటిలోనూ రకరకాల షేడ్లు.. పైగా అద్భుతమైన క్వాలిటీ.. స్టన్నింగ్ విజువల్స్.. మొత్తంగా ‘24’లో ఒకసారి మహేష్ ను పెట్టి చూసుకుంటే అభిమానులకు మతిపోతోందంతే. ‘24’ కచ్చితంగా ఇండియన్ స్క్రీన్ మీద సెన్సేషన్ క్రియేట్ చేయడం ఖాయమనిపిస్తోంది. ఇలాంటి సినిమాను వదులుకుని మహేష్ తప్పు చేశాడేమో అన్న ఫీలింగ్ ఇంకా పెరిగిపోతోంది అభిమానుల్లో. తన డ్రీమ్ ప్రాజెక్ట్ అయిన ‘24’ను విక్రమ్ ముందు మహేష్ బాబుకే చెప్పి.. అతను ఒప్పుకోకుంటే సూర్య దగ్గరికి వెళ్లిన సంగతి తెలిసిందే. ఈ కథ నచ్చి సూర్య స్వయంగా ఈ చిత్రాన్ని నిర్మించడానికి కూడా ముందుకొచ్చాడు.