సమంతను నిలదీస్తున్న మహేష్ ఫ్యాన్స్

Update: 2017-05-24 11:21 GMT
మరో రెండు రోజుల్లో థియేటర్లలోకి రానున్న రా రండోయ్ వేడుక చూద్దాం మూవీ.. విడుదలకు ముందే జనాలకు పెద్ద వేడుక అయిపోయింది. అమ్మాయిలు మనశ్శాంతికి హానికరం అని చైతు డైలాగ్ చెబితే.. ప్రీ రిలీజ్ ఈవెంట్ లో అమ్మాయిలు పక్కలోకి పనికొస్తారు అని చలపతిరావు అనడం పెద్ద వివాదంగా మారిపోయింది.

చలపతి ఇలా అన్న తర్వాత చైతు-రకుల్ నవ్వినట్లుగా ఉన్న వీడియో కారణంగా.. వీరు కూడా విమర్శల పాలయ్యారు. నాగార్జున.. నాగచైతన్య.. రకుల్ ప్రీత్.. ఇలా ప్రతీ ఒక్కరు చలపతిరావు కామెంట్స్ ను ఖండించారు. కానీ ఇప్పుడీ వివాదంలోకి సమంత పేరు కూడా వినిపిస్తోంది. 1నేనొక్కడినే మూవీ పోస్టర్ పై అప్పట్లో సమంత పెట్టిన ట్వీట్ పెను వివాదం సృష్టించింది. మరిప్పుడు స్వయంగా ఆమె కాబోయే భర్తే 'అమ్మాయిలు మనశ్శాంతికి హానికరం' అంటూ డైలాగ్ కొడితే.. నా గురించి కాదు అంటూ నవ్వుతూ రిప్లై ఇచ్చింది.

అదో సంగతి అయితే.. తన లవర్ కం ఉడ్ బీ అయిన చైతు మూవీ ఫంక్షన్ లో మహిళలపై ఇంతటి ఘోరమైన కామెంట్ వినిపిస్తే.. దానిపైన సమంత రియాక్ట్ కాకపోవడాన్ని మహేష్ ఫ్యాన్స్ నిలదీస్తున్నారు. ఇతర హీరో సినిమాకు అయితే ఓ రకంగా.. అక్కినేని ఫ్యామిలీ సినిమా అయితే మరో రకంగా ప్రవర్తించడాన్ని క్వశ్చన్ చేస్తున్నారు. మరి శామ్ దీనికి ఎలా రియాక్ట్ అవుతుందో?
Tags:    

Similar News