అసలు బెస్ట్ యాక్టర్‌గా మహేష్‌బాబుకు నామినేషన్ కూడా ఇవ్వకపోవడమేంటని 62వ ఫిలింఫేర్ అవార్డుల తాలూకు నామినేషన్స్ వచ్చినప్పుడే అబిమానులు కోపమొచ్చింది. ఇకపోతే ఆ సంగతిని మర్చిపోయారనుకుంటే.. అసలు మహేష్ సినిమాను ఒక దృశ్యకావ్యంలా తీసిన రత్నవేలుకు కూడా అవార్డు ఎందుకు ఇవ్వలేదని వారు ఇప్పుడు ప్రశ్నిస్తున్నారు. దీనికి సమాధానాలు ఏంటో చూద్దాం పదండి.
నిన్న జరిగిన ఫిలింఫేర్ అవార్డుల ప్రధానోత్సవంకు ఓపెనింగ్‌గా బెస్ట్ సినిమాటోగ్రాఫర్ అవార్డును ఇచ్చారు. ''మనం'' సినిమాకు గాను పిఎస్ వినోద్ ఈ అవార్డును గెలుచుకున్నారు. అయితే 1-నేనొక్కడినే సినిమాకు రత్నవేలు తీసిన ఫోటో గ్రాఫీ అంత అద్భుతంగా ఉంటే, అవార్డు ఆయనకు ఇవ్వకుండా వినోద్‌కు ఇవ్వడమేంటి అంటూ మహేష్ ఫ్యాన్స్ హల్‌చల్ చేస్తున్నారు. పైగా వీరు ఇలాంటి సూటిపోటి ఘాటైన డైలాగులతో ట్విట్టర్‌లో పంచ్‌లు వేస్తుంటే అవన్నీ రత్నవేలు సార్ రీ-ట్వీట్ చేస్తున్నారు కూడా.
ఏదేమైనా ఒకసారి ఒక అవార్డును ప్రకటించేశాక ఇక చేసేది ఏముంటుంది. కాని అలాగని మనం సినిమా ఫోటోగ్రాఫీ తీసిపాడేసేంత ఈజీ వర్క్ కాదు. ఆ సినిమాలో కూడా ఫోటోగ్రాఫీ చాలా అద్భుతంగానే ఉందిగా...