మహేష్ గౌతమ్ డిష్యుం డిష్యుం!

Update: 2018-09-05 08:43 GMT
అభిమానులకు హీరోలు సూపర్ స్టార్లు గా దేవుళ్ళుగా కనిపిస్తారు కానీ ఆయా తారల కుటుంబ సభ్యులకు కాదుగా. ఇళ్లలో వాళ్ళు వ్యవహరించే తీరు వేరుగా ఉంటుంది. షూటింగ్స్ లో అలిసిపోయి విపరీతమైన పని ఒత్తిడి మధ్య ఇంటికి చేరే కథానాయకులు సేదతీరేది ఫ్యామిలీతోనే. మహేష్ బాబు లాంటి హీరో అయితే మరీనూ. ఎంత బిజీగా ఉన్నా ఇద్దరు పిల్లలు సితార గౌతమ్ భార్య నమ్రతా శిరోద్కర్ తో ఎప్పటికప్పుడు కావలసినంత సమయం గడిపే మహేష్ బాబు సుపుత్రుడు గౌతమ్ తో  చేస్తున్న ఒక డిష్యుం డిష్యుం ఫోటో బాగా వైరల్ అవుతోంది. ఇద్దరూ సరదాగా గొడవ పడుతూ ఫైట్ చేస్తున్న పిక్ చూసి ఫాన్స్ తెగ సంబరపడుతున్నారు. గౌతమ్ ను వెనుక నుంచి ఒడిసి పట్టుకున్న మహేష్ పట్టు నుంచి తప్పించుకోవడానికి విశ్వప్రయత్నం చేస్తున్న తీరు అంతా తమాషాగా ఉంది. మహర్షి కోసం గెడ్డం పెంచాక మహేష్ ఎక్కువ బయట కనిపించడం లేదు.

కృష్ణ గారు ఇలా కొడుకుతో కలిసి తెరమీద కూడా ఫైట్లు చేసిన సందర్భాన్ని కొందరు గుర్తు చేసుకుంటున్నారు. మహేష్ బాలనటుడిగా సినిమాలు చేస్తున్న టైంలోనే కృష్ణతో కలిసి ముగ్గురు కొడుకులు-కొడుకు దిద్దిన కాపురం-గూఢచారి 116 లాంటి సినిమాల్లో విలన్ల భరతం పట్టాడు. ఆ టైంలో మహేష్ వయసు ఇప్పుడు గౌతమ్ కన్నా మహా అంటే ఓ రెండు మూడేళ్లు ఎక్కువ అంతే. కలిసి చాలా సినిమాల్లో చేసారు.  గౌతమ్ ని కూడా అలా కాంబినేషన్ సీన్స్ లో మహేష్ తో పాటు చూడాలని అభిమానులు కోరుతున్నారు కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో అది జరిగే పని కాదు. పైగా మహేష్ నమ్రతా ఇద్దరూ పిల్లల చదువు అయ్యే దాకా సినిమా ప్రపంచం దూరం అని పలుమార్లు చెప్పారు. సో ఇలాంటి సరదా ఫొటోల్లోనే తప్ప ఇద్దరినీ సిల్వర్ స్క్రీన్ పై ఒకేసారి చూసే ఛాన్స్ మాత్రం దగ్గరలో లేదు. అందాకా వీటితో సర్దుకోక తప్పదు.
Tags:    

Similar News