వీడియో : ఇది కదా మహేష్‌ ఫిట్‌ నెస్‌ రహస్యం

Update: 2022-09-07 07:34 GMT
సూపర్ స్టార్‌ మహేష్ బాబు వయసు యాబై ఏళ్లకు చేరువ అవుతోంది. అయినా కూడా ఆయన మూడు పదుల వయసు కుర్రాడి మాదిరిగానే కనిపిస్తుంటాడు. ఆయన లుక్ విషయం లో ఎప్పటికప్పుడు సోషల్‌ మీడియాలో చర్చ జరుగుతూనే ఉంటుంది. మహేష్ బాబు వయసు పెరుగుతున్న కొద్దీ ఆయన మరింత అందంగా కనిపిస్తున్నారంటూ ఈతరం అమ్మాయిలు కూడా ఆయనకు అభిమానులుగా మారుతూ ఉన్నారు.

సినిమా ఇండస్ట్రీలో మహేష్ బాబు అడుగుపెట్టి దాదాపుగా మూడు దశాబ్దాలు అవుతున్నా కూడా ఆయన జోరు ఎలా అయితే తగ్గడం లేదో.. ఆయన అందం కూడా అలాగే తగ్గడం లేదు.

ఆయన ఫిజిక్‌ మరియు ఆయన ఫేస్ గ్లో ఏమాత్రం తగ్గక పోవడం కు కారణం ఏంటో అంటూ సాధారణ ప్రేక్షకులతో పాటు ఎంతో మంది సెలబ్రెటీలు మరియు ఆయన తోటి హీరోలు కూడా తెలుసుకోవాలని ఉబలాట పడుతూ ఉంటారు.

ఎన్నో ఇంటర్వ్యూల్లో ఎంతో మంది మహేష్ బాబు ని మీరు ఏం తింటారు.. ఏం చేస్తారు ఇంత అందంగా ఉంటారు.. ఇంత యాక్టివ్‌ గా ఉంటారు అంటూ ప్రశ్నించారు. ఆ ప్రశ్నలకు మహేష్ బాబు నవ్వుతూ సంతోషంగా ఉంటాను.. కావాల్సినంత తింటాను అంటూ సమాధానం ఇచ్చాడు. కానీ ఆయన ఈ ఫిట్ నెస్ రహస్యం మరోటి ఉందని ఈ వీడియోను చూస్తుంటే అర్థం అవుతుంది.

మహేష్ బాబు అంత ఫిట్ గా ఉండటంతో పాటు వయసు కనిపించకుండా అందంగా కనిపించడానికి ప్రధాన కారణం ఆయన వర్కౌట్‌. నిజమే మహేష్ బాబు ట్రెడ్‌మిల్ రన్నింగ్‌ చూస్తూ ఉంటే కళ్లు పెద్దవి అవ్వాల్సిందే. బాబోయ్‌ ఏం రన్నింగ్‌ అది అంటూ ఫ్యాన్స్ నోరు వెళ్లబెట్టేలా ఆ పరుగు ఉంది.

ఆ పరుగు ఇంకా ఎన్నో కష్టమైన వర్కౌట్స్ వల్లే మహేష్ బాబు చూడడానికి అలా ఉన్నారు. ఆయన ఇంట్లోనే అత్యాధునిక పరికరాలతో జిమ్ ఉంది. ఆ జిమ్‌ లోనే సాధ్యం అయినంత ఎక్కువ సమయంను మహేష్ బాబు గడుపుతారు. ఆ వర్కౌట్స్ తో పాటు పిల్లతో చాలా క్వాలిటీ సమయం ను గడుపుతారు. అందుకే మహేష్‌ బాబు అంత అందంగా ఫిట్‌ నెస్ తో ఉంటారని టాక్‌.



నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.


Tags:    

Similar News