తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రిలో కలకలం రేగింది. సూపర్ స్టార్ మహేష్ బాబు ఫ్లెక్సీకి కొందరు దుండగులు నిప్పు పెట్టారు. ఈ ఘటన నగరం సహా జిల్లా వ్యాప్తంగా తీవ్ర కలకలం సృష్టించింది. ప్రిన్స్ మహేష్‌బాబు తాజా చిత్రం స్పైడర్ విడుదల సందర్భాన్ని పురస్కరించుకుని మహేష్ అభిమానులు నగరంలో భారీ ఎత్తున ఫ్లెక్సీలను ఏర్పాటు చేశారు. నగరంలోని నాలుగు రోడ్ల కూడళ్లు సహా పలు ప్రధాన సెంటర్లలో మహేష్ నిలువెత్తు ఫ్లెక్సీలు వెలిశాయి.
అయితే నిన్న రాత్రి పొద్దుపోయిన తర్వాత అనూహ్యంగా ఈ ప్లెక్సీలలో పట్టణంలోని నందం గోవిందరాజు సెంటర్‌లో ఏర్పాటుచేసిన మహేష్ బాబు భారీ ఫ్లెక్సీకి దుండగులు నిప్పు పెట్టారు. ఈ విషయం గురువారం ఉదయం వెలుగు చూడడంతో ప్రిన్స్ అభిమానులు తీవ్రస్థాయిలో మండిపడ్డారు. స్పైడర్ మూవీ విజయాన్ని తట్టుకోలేని వారే ఈ ఘాతుకానికి ఒడిగట్టారని వారు ఆరోపించారు. మొత్తంగా ఈ ఉదంతం రాజమండ్రి నగరంలోనే కాకుండా జిల్లా అంతటా కలకలం సృష్టించింది.
గతంలోనూ ఓ అగ్ర హీరోకు చెందిన ఫ్లెక్సీలను గుర్తు తెలఇయని దుండగులు చించివేయడంతో పశ్చిమ గోదావరి జిల్లాలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న విషయం తెలిసిందే. నాటి పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని పోలీసులు వెనువెంటనే రంగంలోకి దిగేశారు. రాజమండ్రి సహా తూర్పు గోదావరి జిల్లా వ్యాప్తంగా సినీ హీరోల అభిమానుల కదలికలపై ప్రత్యేకంగా దృష్టి సారించారు. ఇక మహేష్ ఫ్లెక్సీని దహనం చేసిన వారిని గుర్తించి తక్షణమే అరెస్ట్ చేయాలని ప్రిన్స్ అభిమానులు డిమాండ్ చేశారు.