టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు, విలక్షణ దర్శకుడు కొరటాల శివల కాంబోలో తెరకెక్కిన `భరత్ అనే నేను` చిత్రం సూపర్ హిట్ టాక్ తో రికార్డు కలెక్షన్లు వసూలు చేస్తోన్న సంగతి తెలిసిందే. దీంతో, మహేష్, కొరటాల శివ ...ఈ చిత్రం సక్సెస్ ను పంచుకునేందుకు బెజవాడలో పర్యటించారు. ఈ సందర్భంగా మహేష్ తో పాటు ఆయన బావ, టీడీపీ ఎంపీ గల్లా జయదేవ్ కూడా ఉన్నారు. అక్కడి ఓ థియేటర్లో సినిమాను వీక్షించిన మహేష్....రాజకీయాలకు సంబంధించిన ఆసక్తికర ప్రకటన చేశారు. తాను జీవితాంతం సినిమాలే చేస్తానని, రాజకీయాలు, ఇతర విషయాల జోలికి తాను వెళ్లబోనని మహేష్ మరోమారు స్పష్టం చేశాడు. విజయవాడలోని ఆంధ్రా హాస్పటల్స్ ను సందర్శించిన మహేష్...అక్కడ గుండె ఆపరేషన్ చేయించుకున్న చిన్నారులను కలిసి వారి తల్లిదండ్రులతో మాట్లాడారు.
తనకు రాజకీయాలపై ఆసక్తి లేదని, సినిమాలే తన కెరీర్ అని మహేష్ గతంలో కూడా చాలాసార్లు స్పష్టం చేసిన సంగతి తెలిసిందే. తాజాగా మరోసారి మహేష్ ఇదే విషయం పై క్లారిటీ ఇచ్చారు. తాను ఈ సినిమా విజయోత్సవ పర్యటనకు వచ్చానని, రాజకీయాల గురించి మాట్లాడనని మహేష్ స్పష్టం చేశాడు. జీవితాంతం సినిమాలు చేస్తానని, వేరే విషయాల జోలికి వెళ్లనని తేల్చి చెప్పారు. మరోవైపు, ఆంధ్రా హాస్పిటల్స్ - ఇంగ్లండ్ కు చెందిన లిటిల్ హెవెన్స్ సంస్థ ఆధ్వర్యంలో 300 మంది చిన్నారులకు గుండె ఆపరేషన్లు చేశారు. ఆ చిన్నారులు - వారి తల్లిదండ్రులను మహేష్ కలిశారు. రెండేళ్లుగా చిన్న పిల్లల హార్ట్ ఆపరేషన్లకు మహేష్ సహకారం అందిస్తున్న సంగతి తెలిసిందే. బుర్రిపాలెంలో కూడా మెడికల్ క్యాంపులు నిర్వహించామని వైద్యులు తెలిపారు. త్వరలోనే చిన్న పిల్లల ఆపరేషన్లపై షార్ట్‌ఫిల్మ్ తీసేందుకు మహేష్ అంగీకరించారని ఆంధ్రా హాస్పిటల్ యాజమాన్యం తెలిపింది.