ప్రిన్స్ పిల్లల దీపావళి సంబరాలు

Update: 2015-11-11 03:57 GMT
దీపావళి అంటే దీపాల పండుగ ఎలాగో.. టపాకాయలంటే పిల్లల పండుగ అంతే. టపాసులు కాలుస్తూ వాళ్లు ఎంజాయ్ చేస్తుంటే.. వారిని జాగ్రత్తగా చూసుకుంటూ వారి  ఆనందం చూసి సంబరపడ్డం పేరెంట్స్ కి అలవాటు. సాధారణ మనుషుల ఇల్లయినా.. స్టార్ హీరోల ఇంట్లో అయినా జరిగేది ఇదే.

సూపర్ స్టార్ మహేష్ బాబు పిల్లలిద్దరూ టపాసులు కాలుస్తుంటే.. ఆ ఫోటోలు తీసి ఇన్ స్టాగ్రామ్ లో పోస్ట్ చేసింది మహేష్ భార్య నమ్రత. తమ చిన్నారులు ఎంజాయ్ చేస్తున్న సమయంలో కొందరు వీధి బాలలు వస్తే.. వారితో కలిసి దీపావళి జరుపుకున్నామని చెప్పిందామె.  వీళ్ల ఆనందానికి మహేష్ కూడా జతయ్యాడు. తన పిల్లలు కాకరపువ్వొత్తులు - చిచ్చుబుడ్లు వెలిగిస్తుంటే.. మహేష్ దగ్గరుండి జాగ్రత్తలు తీసుకున్నాడు. ముఖ్యంగా కూతురు సితార  చిన్నపిల్లకావడంతో.. దగ్గరుండి టపాసులు కాల్పించింది తల్లి నమ్రత. మరోవైపు గౌతమ్ మాత్రం.. తెగ ఉత్సాహంగా సందడి చేశాడు. ఎలాంటి అరమరికలు లేకుండా.. పండుగ ఎంజాయ్ చేశాడు గౌతమ్.

ఎంత స్థాయిలో ఉన్నామని కాదన్నయ్యా.. అందరితో కలిసి దీపావళి చేసుకున్నామా లేదా అన్నట్లుగా ఎంజాయ్ చేశాడు జూనియర్ మహేష్ బాబు. సూపర్‌ స్టార్‌ పిల్లలు లాగానే మన తెలుగు రాష్ట్రంలోని పిల్లంందరూ ఆనందంగా దీపావళి జరుపుకోవాలని.. నీలాకాశంలో వారి ఆనందపు కేరింతలు తారాజువ్వల్లా ప్రకాశించాలని.. ఆశిద్దాం
Tags:    

Similar News