ఆల్ ది బెస్ట్ ఫర్ బ్రహ్మోత్సవం... అని మహేష్ బాబుకి ఇప్పటికే బోలెడంత మంది విషెస్ చెప్పుంటారు. ఎవరేం పొగిడినా, ఎవరెన్ని విషెస్ లు చెప్పినా మహేష్ మాత్రం సింపుల్గా థ్యాంక్స్ అని రిప్లై ఇచ్చేస్తుంటారంతే. అయితే తన కొడుకు గౌతమ్ `నాన్నా ఆల్ ది బెస్ట్` అని చెప్పడం వినేసరికి తెగ మురిసిపోయాడు మహేష్. అసలు గౌతమ్ తో ఇదెప్పుడు చెప్పించారు అని వండర్ అయ్యాడు. ఇదంతా కొంచెం టచ్ లో వుంటే చెబుతా టీవీ షోలో జరిగింది. మహేష్ బాబు సాధారణంగా టీవీలకి ఇంటర్వ్యూలు ఇస్తుంటారు కానీ... షోలకి మాత్రం వెళ్లడు. ఏ టీవీ షోలోనూ ఆయన్ని ఇప్పటిదాకా చూడలేదు. అయితే తొలిసారి కొంచెం టచ్ లో వుంటే చెబుతా షోకి వెళ్లాడు. అక్కడ సరదాగా గడిపాడు. బోలెడన్ని ప్రశ్నలకి సరదా ఆన్సర్ లు కూడా ఇచ్చాడు.
మీ అబ్బాయి గౌతమ్ తో మీరు గేమ్స్ ఆడుతుంటారట కదా అని యాంకర్ అడిగిన ప్రశ్నకి మహేష్ స్పందిస్తూ ఇప్పుడు వాడు నాతో ఆడుతున్నాడని సమాధానమిచ్చాడు. వంటింట్లోకి వెళ్లి గరిటె పడుతుంటారా? అని అడిగితే నేనే కాదు - నా భార్య కూడా వంటింట్లోకి వెళ్లదు, ఇక్కడదే హైలెట్ అని నవ్వేశాడు మహేష్. ఇలా షో నిండా మహేష్ బాబు పంచులే. ఎప్పుడూ నవ్వుతూ కనిపించే మహేష్ ఈ షోలో తన స్మైల్ తో మరింత మెస్మరైజ్ చేశాడు. బ్రహ్మోత్సవం ప్రమోషన్స్ లో భాగంగా కొంతకాలంగా మీడియా మధ్యనే గడుపుతున్నాడు మహేష్. అందులో భాగంగానే ఈ కొంచెం టచ్ లో వుంటే చెబుతా షోకి హాజరయ్యాడు.