ట్రంప్ ల్యాండ్ కు మహర్షి కి గ్రీన్ సిగ్నల్

Update: 2018-10-01 11:06 GMT
సూపర్ స్టార్ మహేష్ బాబు తాజా చిత్రం 'మహర్షి' కోసం దర్శకుడు వంశీ పైడిపల్లి అమెరికాలో ఒక లాంగ్ షెడ్యూల్ ప్లాన్ చేయడం జరిగింది.  పోయిన నెలలోనే ఆ షెడ్యూల్ ప్రారంభం కావలసి ఉన్నా ఇమ్మిగ్రేషన్ అధికారులు వీసాలు జారీచేయకపోవడంతో ఆ షెడ్యూల్ ను వాయిదా వేసి హైదరాబాద్ లోనే షూటింగ్ కొనసాగించారు.   తాజా సమాచారం ప్రకారం 'మహర్షి' టీమ్ మెంబర్స్ అందరికీ వీసాలు జారీ అయ్యాయట.

 తెలుగు సినిమా ఈవెంట్స్ పేరుతో వీసాలు తీసుకొన్న వారికి సబంధించిన వివాదాలు ఈమధ్య ఎక్కువ కావడంతో ఇమ్మిగ్రేషన్ అధికారులు ఒకరిరి రెండు సార్లు సరి చూసుకుని గానీ వీసాలు ఇవ్వడం లేదట. పైగా ఇతర సినిమాలకు భిన్నంగా భారీ సంఖ్యలో 'మహర్షి' టీం మెంబర్స్ వీసాల కోసం అప్లై చేయడం తో ఈ ఇబ్బంది ఏర్పడిందట. ఇక ఇప్పుడు వీసాలు వచ్చాయి కాబట్టి ఈ వీకెండ్ లోనే 'మహర్షి' టీమ్  అమెరికాకు ప్రయాణం అవుతోందట.  రెండు నెలల పాటు న్యూ యార్క్.. న్యూ జెర్సీ తదితర నగరాలలో 'మహర్షి' షూట్ జరుగుతుందని సమాచారం.

పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాలో మహేష్ బాబు కు స్నేహితుడిగా అల్లరి నరేష్ నటిస్తున్నాడు.  దేవి శ్రీ ప్రసాద్ ఈ సినిమాకు సంగీత దర్శకుడు.  దిల్ రాజు - అశ్విని దత్ - పీవీపీ లు సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తున్నారు.  వచ్చే ఏడాది ఏప్రిల్ 5 న ఉగాది పండగ సందర్భంగా ఈ సినిమాను విడుదల చేసేందుకు ఫిలిం మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు.
Tags:    

Similar News