సూపర్ స్టార్ మహేష్ బాబు 25వ చిత్రం ‘మహర్షి’పై అంచనాలు తారా స్థాయిలో ఉన్నాయి. 25వ చిత్రం అవ్వడంతో చాలా ప్రత్యేకంగా ఉండాలనే ఉద్దేశ్యంతో మహేష్ బాబు గెటప్ మార్చాడు. ఇప్పటి వరకు ఏ సినిమాలో కూడా కనిపించని విధంగా ఈ చిత్రంలో గడ్డం మరియు మీసాలతో మహేష్ కనిపించబోతున్నాడు. వంశీ పైడిపల్లి దర్శకత్వంలో దిల్ రాజు - అశ్వినీదత్ - పీవీపీల కలయికలో ఈ చిత్రం నిర్మాణం జరుగుతుంది. నిన్న మొన్నటి వరకు అమెరికాలోని పలు ముఖ్య లొకేషన్స్ లో చిత్రీకరణ జరిపిన మహర్షి చిత్ర యూనిట్ సభ్యులు హైదరాబాద్ కు తిరిగి వచ్చారు.
‘మహర్షి’ తదుపరి షెడ్యూల్ ను దీపావళి అయిన తర్వాత మొదలు పెట్టబోతున్నట్లుగా తెలుస్తోంది. తదుపరి షెడ్యూల్ కోసం హైదరాబాద్ శివారు ప్రాంతంలో ఒక పల్లెటూరు సెట్ ను రూపొందిస్తున్నారు. చాలా సహజంగా కనిపించేలా పల్లెటూరు సెట్ కోసం జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ప్రముఖ ఆర్ట్ డైరెక్టర్ ఈ సెట్ ను రెడీ చేస్తున్నట్లుగా సమాచారం అందుతుంది. ఆ పల్లెటూరులోనే అల్లరి నరేష్ తో కలిసి మహేష్ బాబు చిత్రీకరణలో పాల్గొంటాడని సమాచారం అందుతుంది.
సినిమాలో నరేష్ ది ఒక పల్లెటూరు - మహేష్ బాబు తన స్నేహితుడు అయిన అల్లరి నరేష్ కోసం పల్లెటూరుకు వస్తాడట. కథానుసారంగా పల్లెటూరులో చాలా కీలకమైన సన్నివేశాల చిత్రీకరణ జరుపబోతున్నారు. ఎక్కువ సీన్స్ కూడా పల్లెటూరులో చిత్రీకరించబోతున్నారట. అందుకే చాలా ఖర్చు చేసి భారీ ఎత్తున ఒక అందమైన ఆంధ్రా పల్లెటూరును హైదరాబాద్ లో నిర్మిస్తున్నట్లుగా సినీ వర్గాల నుండి సమాచారం అందుతుంది. ప్రస్తుతం సినిమాకు సంబంధించిన పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ కూడా ఒక వైపు జరుపుతున్నారు. జనవరి వరకు సినిమా షూటింగ్ మొత్తం పూర్తి చేసేలా ప్లాన్ చేస్తున్నారు.
ఈ చిత్రంలో హీరోయిన్ గా పూజా హెగ్డే నటిస్తున్న విషయం తెల్సిందే. ఇప్పటి వరకు మహర్షిలో పూజా హెగ్డే లుక్ ఏంటీ, ఆమె పాత్ర ఏంటీ అనే విషయంపై క్లారిటీ రాలేదు. దీపావళి తర్వాత పల్లెటూరు సెట్ లో జరుగబోతున్న చిత్రీకరణలో పూజా హెగ్డే నటించబోతుందా లేదా అనేది క్లారిటీ లేదు. వచ్చే సమ్మర్ లో ఈ చిత్రం విడుదలకు ముహూర్తం కుదిరింది. భరత్ అనే నేను చిత్రం తర్వాత మరో బ్లాక్ బస్టర్ ను మహేష్ బాబు ఈ చిత్రంతో దక్కించుకోవడం ఖాయం అంటూ ఫ్యాన్స్ చాలా నమ్మకంతో ఉన్నారు. చిత్ర యూనిట్ సభ్యులు కూడా ఈ చిత్రంపై చాలా నమ్మకంను కలిగి ఉన్నారు.