బయట ఎవరికీ తెలియడం లేదు కానీ... మహేష్ చాలా చాలా కథలే వింటున్నాడు. ఇప్పటికే ఆయనకోసం అరడజను మంది దర్శకులు కథలు సిద్ధం చేసుకొని ఎదురు చూస్తున్నారు. అయినా సరే... అదనంగా మరికొన్ని కథలు విని పక్కా చేసి పెట్టుకొన్నాడు మహేష్.
మనం ఫేమ్ విక్రమ్‌కుమార్ దర్శకత్వంలోనూ ఓ సినిమా చేయబోతున్నాడట. ఆ విషయాన్ని స్వయంగా విక్రమ్ మీడియా ముందు వెల్లడించాడు. తెలుగు - తమిళ భాషల్లో ఆ సినిమాని తెరకెక్కించబోతున్నాడట. ఇటీవలే కథ విన్న మహేష్ చాలా బాగుందని మెచ్చుకున్నాడట. వెంటనే సినిమా చేస్తానని గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశాడట.
అయితే ఆ చిత్రం తెరకెక్కడానికి ఇంకాస్త సమయం పడుతుందని, కథ ఓకే అయ్యింది కానీ... స్క్రిప్టు పూర్తిస్థాయిలో సిద్ధం కావడానికి మాత్రం ఆర్నెళ్లు సమయం పడుతుందని విక్రమ్ వెల్లడించాడు. మొదట ఆయన అల్లు అర్జున్ తో సినిమా చేయబోతున్నాడట. ఆ తర్వాతే మహేష్ తో వుంటుందట. అల్లు అర్జున్ సినిమా కూడా బైలింగ్వల్ గా తెలుగు - తమిళ భాషల్లో తెరకెక్కబోతోందట.
24 ప్రమోషన్స్ లో భాగంగా విక్రమ్ మీడియా ముందుకొస్తున్నాడు. ఈ చిత్రం గురించి బాలీవుడ్ సైతం ఆసక్తికరంగా ఎదురు చూస్తోంది. ఒకవేళ 24 ఘన విజయం సాధిస్తే అదే కథని బాలీవుడ్ లోని అగ్ర కథానాయకులు ఎవరైనా చేయడానికి సిద్ధమైతే విక్రమ్ అక్కడకి వెళ్లినా ఆశ్చర్యపోనవసరం లేదు. అందుకే అల్లు అర్జున్ కూడా సేఫ్ సైడ్ గా లింగుస్వామి కథని కూడా ఓకే చేసి పెట్టుకున్నాడు. విక్రమ్ కెరీర్ మాత్రం `మనం` సినిమా నుంచి మలుపు తిరిగింది. ఆయనతో కలిసి సినిమా చేసేందుకు అగ్ర కథానాయకులంతా ఆసక్తి చూపుతున్నారిప్పుడు.